తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates On 02 October 2022

Gold Silver Rate Today : తగ్గిన బంగారం, వెండి ధరలు - హైదరాబాద్​లో ఎంతంటే..

02 October 2022, 6:41 IST

    • Gold and Silver Price today 02 october 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే శనివారం ధరలు పెరగగా... ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు తగ్గింది.
బంగారం వెండి ధరలు
బంగారం వెండి ధరలు

బంగారం వెండి ధరలు

Gold silver price today 02 october 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. శనివారం ధరలు ఎగబాకగా... ఇవాళ మాత్రం కాస్త దిగివచ్చాయి. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ. 170 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ. 100 తగ్గి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62,000గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,500గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,730గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 62,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,730గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,500 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 170 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.