తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Withdraw Epf Balance : ఆన్​లైన్​లో ఈపీఎఫ్​ డబ్బులను ఇలా విత్​డ్రా చేసుకోండి..

How to withdraw EPF balance : ఆన్​లైన్​లో ఈపీఎఫ్​ డబ్బులను ఇలా విత్​డ్రా చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

14 April 2024, 12:44 IST

  • How to withdraw EPF balance online : ఆన్​లైన్​లో ఈపీఎఫ్​ డబ్బులు ఎలా విత్​డ్రా చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..

 ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ని ఆన్​లైన్​లో ఇలా విత్​డ్రా చేసుకోండి..
ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ని ఆన్​లైన్​లో ఇలా విత్​డ్రా చేసుకోండి..

ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ని ఆన్​లైన్​లో ఇలా విత్​డ్రా చేసుకోండి..

How to withdraw EPF balance online :  ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నుంచి డబ్బులను విత్​డ్రా చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈపీఎఫ్​ ఉపసంహరణ నిబంధనలు, ఆన్​లైన్​లో డబ్బులను ఎలా విత్​డ్రా చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈపీఎఫ్ ఉపసంహరణ నిబంధనలు

సాధారణంగా, చందాదారుడు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం లేదా చందాదారుడు పదవీ విరమణ తర్వాత నిరుద్యోగిగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తి ఈపీఎఫ్ ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఈపీఎఫ్ఓ సబ్​స్క్రైబర్​ తన లేదా పిల్లల వివాహం, వైద్య అవసరాలు, ఇంటి కొనుగోలు, గృహ రుణ చెల్లింపు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అనేక ప్రయోజనాల కోసం పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాక్షిక ఉపసంహరణలలో చాలా వరకు, చందాదారుడు కనీసం ఐదు లేదా ఏడు సంవత్సరాలు ఈపీఎఫ్ సబ్​స్క్రైబర్​ అయి ఉండాలి.

How to withdraw your pf balance online : పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం.. మీరు ఉద్యోగం మారాలనుకుంటే.. మీ ఈపీఎఫ్ పాస్​బుక్​ బ్యాలెన్స్ ఆటోమేటిక్​గా కొత్త ఎప్లాయర్​కి బదిలీ అవుతుంది. ఇక ఇప్పుడు.. ఈపీఎఫ్​ నుంచి డబ్బులు ఎలా విత్​డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము..  

ఆన్​లైన్​లో ఈపీఎఫ్ ఉపసంహరణ..

1. అవసరమైన వివరాలు: ముందుగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్), సబ్​స్క్రైబర్​ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, క్యాన్సిల్ అయిన చెక్కు అనే నాలుగు డాక్యుమెంట్లు లేదా వివరాలు మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి.

2. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు యూఏఎన్ పోర్టల్​కు వెళ్లాలి.

3. ఇప్పుడు ఆధార్​తో రిజిస్టర్ చేసుకున్న మీ మొబైల్ నెంబర్​కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది.

4. Withdraw money from PF account : ఇప్పుడు మీరు ఈ క్రింది చిత్రంలో చూపించిన విధంగా ఓటీపీ, క్యాప్చాని ఎంటర్ చేయాలి.

ఈపీఎఫ్​ విత్​డ్రా ప్రక్రియ..

5. ఇప్పుడు మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ పేజీ పైన కుడి భాగంలో మీకు 'ఆన్​లైన్​ సేవలు' ఆప్షన్​ కనిపిస్తుంది. స్క్రోల్ డౌన్ ఆప్షన్లలో 'క్లెయిమ్' మీద క్లిక్ చేయండి.

6. ఇప్పుడు ఈపీఎఫ్ఓతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మెంబర్ వివరాలను వెరిఫై చేయాలి.

EPFO latest news : 7. అప్పుడు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఈ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని మీకు అండర్టేకింగ్ సర్టిఫికేట్ వస్తుంది. మీరు ఆశించినట్లుగా, నియమనిబంధనలకు 'యెస్​ క్లిక్ చేయాలి. 

8. ఇప్పుడు మీరు ఆన్​లైన్ క్లెయిమ్ల కోసం ముందుకు సాగవచ్చు. ఆప్షన్ పై క్లిక్ చేయగానే కింది ఇమేజ్​లో చూపించిన విధంగా మరిన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్​ విత్​డ్రా ప్రక్రియ..

9. ఇప్పుడు మీరు 'నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను', 'ఉద్యోగి చిరునామా' వంటి వివరాలను నమోదు చేయాలి. స్కాన్ చేసిన చెక్కు, ఫామ్ 15జీ వంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

10. మీ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్​ను విత్​డ్రా చేసుకోవడానికి ఫామ్ సబ్మిట్ చేయొచ్చు.