తెలుగు న్యూస్  /  Business  /  Car Sales In India Clocks Record 37.93lakh Vehicles In 2022

Car sales in India : 2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

02 January 2023, 13:19 IST

    • Car sales in India in 2022 : 2022లో ఆటో పరిశ్రమ దూసుకెళ్లింది! గతేడాదిలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి!
2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!
2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

Car sales in India in 2022 : కొవిడ్​ సంక్షోభంతో దాదాపు రెండేళ్ల పాటు అల్లాడిపోయిన ఆటో పరిశ్రమకు 2022 కలిసొచ్చింది! దేశీయ ఆటో రంగం.. 2022లో భారీగా పుంజుకుంది. ముఖ్యంగా డొమెస్టిక్​ ప్యాసింజర్​ వెహికిల్స్​ సెగ్మెంట్​ రయ్​రయ్​మంటూ దూసుకెళ్లింది. 2022లో మొత్తం మీద 37.93లక్షల ప్యాసింజర్​ వెహికిల్స్​ అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 23శాతం అధికం! టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, హ్యుందాయ్​ వంటి దిగ్గజ ఆటో సంస్థలు.. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లకు ఆకర్షించాయి. సెమీకండక్టర్​ల కొరత వంటి సవాళ్లు తగ్గిపోతుండటం కూడా ఆటో పరిశ్రమకు కలిసివచ్చింది. ముఖ్యంగా టయోటా, స్కోడా వంటి సంస్థలు.. అత్యధిక సేల్స్​ను సాధించాయి.

తగ్గేదే.. లే!

"2022 జనవరి- డిసెంబర్​లో పరిశ్రమ హోల్​సేల్​ విక్రయాలు దాదాపు 38లక్షల యూనిట్​లుగా నమోదయ్యాయి. ఓ క్యాలెండర్​ ఇయర్​లో ఆటో పరిశ్రమకు ఇదే అత్యధిక నెంబర్​! 2018లో 33.5లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి. అంటే.. అప్పటితో పోల్చుకుంటే ఇది 14శాతం ఎక్కువ. ఇండియాలో ఆటో రంగానికి ఇంకా పొటెన్షియల్​ ఉంది," అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​, మార్కెటింగ్​ అండ్​ సేల్స్​ శశాంక్​ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. 2022లో కొవిడ్​ సంక్షోభం ప్రభావం తగ్గడం, సెమీకండక్టర్​ల సమస్య పరిష్కారమవుతుండటం.. ఆటో సంస్థలకు కలిసివచ్చిందని శశాంక్​ అభిప్రాయపడ్డారు.

Car sales in India : "గత మూడేళ్లల్లో ఆటో విక్రయాలు తగ్గాయి. కానీ ఎస్​యూవీలకు డిమాండ్​ పెరుగుతూనే ఉంది. మొత్తం ప్యాసింజర్​ వెహికిల్​ సేల్స్​లో ఎస్​యూవీ వాటా 42.3శాతంగా ఉండటం విశేషం. 2022లో అమ్ముడుపోయిన మొత్తం వాహనాల్లో రూ. 10లక్షలు, అంతకన్నా తక్కువ ధర ఉన్న వెహికిల్స్​ వాటా 40శాతం ఉండొచ్చు," అని శశాంక శ్రీవాస్తవ వెల్లడించారు.

Maruti Suzuki car sales in December : ఇక మారుతీ సుజుకీ విషయానికొస్తే.. 2022లో 15.76లక్షల యునిట్​లను విక్రయించింది ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ. 2021లో ఇది 13.64లక్షలుగా ఉండేది. అంట 16శాతం పెరిగినట్టు. మరోవైపు.. హ్యుందాయ్​ మోటార్స్​.. 2022లో 5,52,511 యూనిట్​ను అమ్మింది. 2021(5,05,033)తో పోల్చుకుంటే ఇది 9.4శాతం ఎక్కువ.

Tata Motors car sales in 2022 : అదే విధంగా టాటా మోటార్స్​కి సైతం 2022 కలిసి వచ్చింది. హోల్​సేల్​గా 5,26,798 యూనిట్​లను గతేడాదిలో విక్రయించింది టాటా మోటార్స్​. ఈ సంస్థకు చెందిన డిసెంబర్​ ఆటో సేల్స్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టయోటా కిర్లోస్కర్​, స్కోడా ఆటో ఇండియా వంటి సంస్థలు.. 2022లో దుమ్మురేపాయి! ఇండియాలో.. ఆయా సంస్థల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సేల్స్​ జరిగాయి. టయోటా 1,60,357 యూనిట్​లను విక్రయించగా.. స్కోడా సంస్థ 53,721 వాహనాలను అమ్మింది.

భారత ఆటో పరిశ్రమకు 2022 ఆగస్టు- అక్టోబర్​ నెలలు కలిసివచ్చాయి. పండుగ సీజన్​లో వాహనాల విక్రయలు రికార్డు స్థాయిలో జరగడం ఇందుకు ప్రధాన కారణం.

2023లోనూ ఇదే తరహా జోష్​ కొనసాగుతుందని ఆటో సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు లాంచ్​లతో సన్నద్ధమవుతున్నాయి. డిమాండ్​ ఉన్న వాహనాలకు సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లను కూడా సిద్ధంచేస్తున్నాయి.