Tata Motors car sales : 13.9శాతం పెరిగిన టాటా మోటార్స్​ సేల్స్​..-tata motors records 13 9 percent sales growth in december ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Car Sales : 13.9శాతం పెరిగిన టాటా మోటార్స్​ సేల్స్​..

Tata Motors car sales : 13.9శాతం పెరిగిన టాటా మోటార్స్​ సేల్స్​..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 07:01 AM IST

Tata Motors car sales data : డిసెంబర్​కు సంబంధించిన సేల్స్​ డేటాను రిలీజ్​ చేసింది టాటా మోటార్స్​. మొత్తం మీద 13.9శాతం వృద్ధిని నమోదు చేసింది.

టాటా మోటార్స్​
టాటా మోటార్స్​

Tata Motors car sales in December 2022 : 2022 డిసెంబర్​కు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​. 40,407 ప్యాసింజర్​ యూనిట్స్​ను విక్రయించింది. 2021 డిసెంబర్​లో అది 35,462 యూనిట్లుగా ఉంది. అంటే.. ఈసారి 13.9శాతం వృద్ధిని నమోదు చేసినట్టు! మొత్తం మీద.. సేల్స్​ విషయంలో డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో 32.8శాతం వృద్ధిని సాధించినట్టు టాటా మోటార్స్​ వెల్లడించింది. 2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో 1,32,255 ప్యాసింజర్​ వాహనాలను విక్రయించినట్టు స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 99,564గా ఉండేదని వివరించింది.

ఒక్క డొమెస్టిక్​ మార్కెట్​లోనే 40,043 ప్యాసింజిర్​ వెహికిల్స్​ను డిసెంబర్​లో విక్రయించింది టాటా మోటార్స్​. 2021 డిసెంబర్​ (35,2999)తో పోల్చుకుంటే ఇది 13.4శాతం ఎక్కువ. మొత్తం మీద గత త్రైమాసికంలో 1,31,297 యూనిట్​లను డొమెస్టిక్​ మార్కెట్​లో విక్రయించింది.

Tata Motors price hike : టాటా మోటార్స్​ ఎగుమతులు కూడా గత నెలలో గణనీయంగా పెరిగాయి. విదేశీ విపణిలోకి 364 వాహనాలను ఎగుమతి చేసింది ఈ దిగ్గజ ఆటో సంస్థ. 2021 డిసెంబర్​ (163)తో పోల్చుకుంటే ఇది 13.9శాతం ఎక్కువ.

ఇక దేశీయ ఈవీ సెగ్మెంట్​లో దూసుకెళుతున్న టాటా మోటార్స్​.. 2022 డిసెంబర్​లో 3,868 ఎలక్ట్రిక్​ వాహనాలను అమ్మింది. 2021 డిసెంబర్​తో (2,355) పోల్చుకుంటే ఇది 64.2శాతం అధికంగా ఉండటం విశేషం. ఇక ఎఫ్​వై23 మూడో త్రైమాసికంలో మొత్తం మీద 12,596 ఈవీలను విక్రయించింది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో 5,826 యూనిట్​లను సేల్​ చేసింది. అంటే ఈ సెగ్మెంట్​లో 116.2శాతం వృద్ధిని నమోదు చేసినట్టు!

Tata Motors car sales data : "2022 సంవత్సరం మాకు ఎంతో కీలకం. పరిశ్రమ కన్నా ఎక్కువ వృద్ధిని నమోదు చేశాము. 5లక్షల మైలురాయిని అందుకున్నాము. ఇక ప్యాసింజర్​​ వెహికల్​ సెగ్మెంట్​లో గత త్రైమాసికం ది బెస్ట్​గా నిలిచింది. కొత్త లాంచ్​లు, పండుగ డిమాండ్​, వాహనాల సప్లై మాకు కలిసి వచ్చింది. భవిష్యత్తులో కూడా మా వృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము," అని టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్స్​, టాటా ప్యాసింజర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ లిమిటెడ్​ ఎండీ శైలేష్​ చంద్ర వెల్లడించారు.

టయోటా.. అదుర్స్​..!

Toyota car sales data : డిసెంబర్​తో పాటు 2022 మొత్తానికి సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను రిలీజ్​ చేసింది టయోటా కిర్లోస్కర్​ మోటార్​. ఇండియాలో.. దశాబ్ద కలంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది ఈ సంస్థ. డిసెంబర్​లో 10,421 యూనిట్​లు సేల్​ చేసింది. 2021 డిసెంబర్​లో అది 10,834గా ఉంది. కాగా.. 2022 మొత్తం మీద 1,60,357 యూనిట్​లను విక్రయించింది. 2021తో (1,30,768) పోల్చుకుంటే ఇది 23శాతం అధికం. గతంలో.. అంటే 2012లో 1,72,241 యూనిట్​లను విక్రయించింది. ఆ తర్వాత ఈ స్థాయిలో సేల్స్​ ఎప్పుడు జరగలేదు.

అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​, ఇన్నోవా హైక్రాస్​ వంటి కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షించినట్టు, అందుకే సేల్స్​ వృద్ధి చెందినట్టు సంస్థ చెబుతోంది. ఈ రెండు వాహనాలకు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తున్నట్టు వెల్లడించింది. ఫార్చ్యునర్​, లెజెండర్​, కామ్రీ, వెల్​ఫైర్​ వంటి మోడల్స్​కు క్రేజ్​ కొనసాగుతోందని స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం