Tata Motors EV milestone : ఈవీ సెగ్మెంట్​లో 'టాటా' హవా.. 50వేల కార్లు డెలివరీ!-tata motors reaches new milestone delivers 50 000 electric cars ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Ev Milestone : ఈవీ సెగ్మెంట్​లో 'టాటా' హవా.. 50వేల కార్లు డెలివరీ!

Tata Motors EV milestone : ఈవీ సెగ్మెంట్​లో 'టాటా' హవా.. 50వేల కార్లు డెలివరీ!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 07:55 AM IST

Tata Motors EV milestone : ఈవీ సెగ్మెంట్​లో మరో మైలురాయిని అందుకుంది టాటా మోటార్స్​. 50,000వ కారును డెలివరీ చేసింది.

50000వ టాటా ఈవీ కారును అందుకున్న సంస్థ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​
50000వ టాటా ఈవీ కారును అందుకున్న సంస్థ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ (HT AUTO)

Tata Motors EV milestone : దేశంలోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ హవా కొనసాగుతోంది! ఈ పరిశ్రమకు సంబంధించి.. అధిక మార్కెట్​ షేరు కలిగి ఉన్న టాటా మోటార్స్​, తాజాగా 50,000వ ఈవీని విక్రయించింది. టాటా నెక్సాన్​ ఈవీకి సంబంధించిన ఈ వెహికిల్​ను.. టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ అందుకున్నారు. ఈ విషయాన్ని ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ.. సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది.

టాటా మోటార్స్​కు సంబంధించి దేశంలో ప్రస్తుతం మూడు ఈవీలు ఉన్నాయి. అవి నెక్సాన్​ ఈవీ, టిగోర్​ ఈవీ, టియాగో ఈవీ. నెక్సాన్​ ఈవీ రెండు వేరింట్లలో అందుబాటులో ఉంది. అవి.. నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​, నెక్సాన్​ ఈవీ ప్రైమ్​.

Tata Nexon EV sales : టాటా మోటార్స్​కు సంబంధించి.. బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకుంది నెక్సాన్​ ఈవీ. అంతేకాకుండా.. ఇండియాలోనే టాప్​ సెల్లింగ్​ మోడల్​గానూ పేరు సంపాదించుకుంది. దీని బట్టి.. ఈ నెక్సాన్​ ఈవీకి ఎంత డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యుందాయ్​ కోనా ఈవీలకి గట్టి పోటీనిస్తోంది ఈ టాటా నెక్సాన్​ ఈవీ. వాస్తవానికి.. నెక్సాన్​ ఈవీతోనే ఎలక్ట్రిక్​ వెహికిల్​ సెగ్మెంట్​లో బలమైన పట్టు సాధించగలిగింది టాటా మోటార్స్​.

How to select the best Electric car : ది బెస్ట్​ ఈవీని ఎంచుకోవడం ఎలా? అనే విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 437కి.మీల దూరం ప్రయాణించగలదు. ఇందులో 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఈ ఏడాది మేలోనే దీనిని లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దీని ధర రూ. 17.74లక్షలు- రూ. 19.24లక్షలు(ఎక్స్​షోరూం ప్రైజ్​) మధ్యలో ఉంటుంది. నెక్సాన్​ ఈవీకి హైఎండ్​ మోడలే ఈ నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​. నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ అనేది లోయర్​ వేరియంట్​గా గుర్తింపు తెచ్చుకుంది.

Tata Motors EV sales : ఇక నెక్సాన్​ ఈవీ గ్రాండ్​ సక్సెస్​ అవ్వడంతో.. టాటా మోటర్స్​ వెనుదిరిగి చూసుకోలేదు! వెంటవెంటనే కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేసింది. ఈ క్రమంలోనే టిగోర్​ ఈవీ, టియాగో ఈవీ మార్కెట్​లోకి వచ్చాయి. ఈ రెండింటికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్​ వాహనాలుగా ఈ రెండు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

టాటా పంచ్​ ఈవీ కూడా..!

Tata Punch EV : ఈవీ సెగ్మెంట్​లో దూకుడు ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్​.. మరో ఎలక్ట్రిక్​ వాహనాన్ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది క్రితం లాంచ్​ అయిన టాటా పంచ్​కు ఎలక్ట్రిక్​ వర్షెన్​ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది ఈ దిగ్గజ ఆటో సంస్థ. 2023 రెండో భాగంలో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం