Toyota Innova EV : ఇన్నోవా ‘ఈవీ’ వర్షెన్​ లాంచ్​కు టయోటా ప్లాన్స్​..!-toyota innova ev caught testing for the first time see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Innova Ev : ఇన్నోవా ‘ఈవీ’ వర్షెన్​ లాంచ్​కు టయోటా ప్లాన్స్​..!

Toyota Innova EV : ఇన్నోవా ‘ఈవీ’ వర్షెన్​ లాంచ్​కు టయోటా ప్లాన్స్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 02, 2022 07:17 AM IST

Toyota Innova EV : ఇన్నోవాకు ఈవీ వర్షెన్​ను తీసుకొచ్చే ప్లాన్స్​లో టయోటా సంస్థ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వెహికిల్​.. టెస్టింగ్​ దశలో ఉన్నట్టు సమాచారం.

టయోటా ఇన్నోవా ఈవీ..
టయోటా ఇన్నోవా ఈవీ..

Toyota Innova EV : టయోటా సంస్థ జోరు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నోవా హైక్రాస్​ను ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో గ్రాండ్​గా లాంచ్​ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో మోడల్​పై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్న ఇన్నోవాకు ఈవీ వర్షెన్​ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ టయోటా ఇన్నోవా ఈవీ.. ఇండోనేషియాలో ఇప్పటికే టెస్టింగ్​ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇన్నోవా ఈవీ.. సూపర్​!

టయోటా ఇన్నోవా ఈవీగా భావిస్తున్న ఓ ఫొటో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఇన్నోవా మోడల్​లో క్లోజ్డ్​ గ్రిల్​తో హెడ్​ల్యాంప్​ యూనిట్స్​ కనిపిస్తున్నాయి. పాత ఇన్నోవా క్రిస్టా మోడల్​తో ఇది పోలి ఉండటం విశేషం. ఇక ఈ వెహికిల్​ రేర్​లో.. 'ఇన్నోవా ఈవీ' అనే బ్యాడ్జ్​ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Toyota Innova EV first look : ఈ స్పై ఫొటోలో.. ఇన్నోవా ఈవీలో వర్టికల్​ ఫాగ్​ ల్యాంప్​ కేసింగ్స్​ ఉన్నట్టు కనిపిస్తోంది. సైడ్స్​లో అలోయ్​ వీల్స్​, బ్లూ గ్రాఫిక్స్​ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇన్నోవా ఈవీ ఇంటీరియర్​.. ఐసీఈ వర్షెన్​తో పోలి ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఇందులో టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 3 స్పోక్​ మల్టీ ఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, అనలాగ్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​ ఉండనున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్​లో.. ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్​ మోటార్​ షోలో.. ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్​ను బయటపెట్టింది టయోటా. ఇందులోని ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీప్​పై బ్యాటరీ లెవల్​, రేంజ్​- పవర్​ ఔట్​పుట్​ వంటి వివరాలు కనిపిస్తాయి.

ఇన్నోవాను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది టయోటా సంస్థ. ఇది పెట్రోల్​, లేదా డీజిల్​ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక ఇన్నోవాకు హైబ్రీడ్​ వేరియంట్​ను ఇటీవలే ఇండియాలోనూ లాంచ్​ చేసింది టయోటా. ఇక ఇన్నోవా ఎలక్ట్రిక్​ వర్షెన్​ కూడా వస్తే.. సంస్థకు డిమాండ్​ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. ఇన్నోవా సీఎన్​జీ వర్షెన్​ కూడా త్వరలో ఇండియాలో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్​..

Toyota Innova HyCross : ఆటోమొబైల్​ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. గత నెల 25న ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీనితో పాటు.. బుకింగ్స్​ని కూడా మొదలుపెట్టింది టయోటా సంస్థ. 2023 జనవరి మధ్య వారంలో నుంచి డెలివరీలు మొదలుపెడతామని స్పష్టం చేసింది. ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్​.. ఇన్నోవా జెనిక్స్​ పేరుతో ఇండోనేషియా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం