Kia EV9 Electric SUV: ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా (Kia) కొత్తగా మరో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఆ సంస్థ టీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కియా ఇండియా. వచ్చే నెల నోయిడాలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023)లో కియా ఈవీ9 కాన్సెప్ట్ (Kia EV9 Concept)ను ఆ సంస్థ ప్రదర్శించే అవకాశం ఉంది. 2021 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ ఈవీ9 కాన్సెప్ట్‌ను కియా వెల్లడించింది. ఇప్పుడు ఇండియాలో 2023 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ను ప్రదర్శించేందుకు కియా సిద్ధమవుతోందని అంచనా. కాగా, ఈ Kia EV9 Electric SVUకి సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటికి వచ్చాయి. సొలార్ ప్యానెల్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
మూడు వరుసల సీటింగ్‍తో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు వస్తుంది. ఈ ఎస్‍యూవీ ప్రొడక్షన్ 2023లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‍లో ఈవీ6 ఫ్లాగ్‍షిప్ మోడల్‍ను అందుబాటులోకి తెచ్చింది కియా.
Kia EV9 Electric SUV: కాన్సెప్ట్ వెల్లడించిన సమయంలోనే కియా ఈవీ9 చాలా మంది దృష్టిని ఆకర్షించింది. బుల్ట్-ఇన్‍గా సొలార్ ప్యానెల్ ఉండడం ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి స్పెషాలిటీగా ఉంది. పాపప్ స్టీరింగ్ వీల్, పనోరామిక్ సన్‍రూఫ్, 27 ఇంచుల అల్ట్రా వైడ్ డిస్‍ప్లేతో ఈ ఎలక్ట్రిక్ కియా ఈవీ9తో రానుంది. కాగా దీని ఇంటీరియర్.. సస్టైనబుల్ మెటీరియల్‍తో రూపొందడం మరో ప్రత్యేకతగా ఉంది. అలాగే పిల్లర్ లెస్ డిజైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ-జీఎంపీ ప్లాట్‍ఫామ్‍ను కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కోసం ఆ సంస్థ వినియోగిస్తున్నట్టు సమాచారం. 77.4 కిలో వాట్ హవర్ బ్యాటరీతో ఈ వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఈ ఆటో ఎక్స్‌పోలో కార్నివల్.. కొత్త (New Kia Carnival) మోడల్‍ను కూడా కియా తీసుకురానుంది. కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ఎడిషన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వచ్చే నెల (జనవరి 2023) 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆటో ఎక్స్‌పో 2023 జరగనుంది. ఉత్తర ప్రదేశ్‍లోని గ్రేటర్ నోయిడా సమీపంలోని జేపీ గల్ఫ్ కోర్స్‌లో ఈ ఎక్స్‌పో జరుగుతుంది. అన్ని ఆటోమొబైల్ సంస్థలు.. కార్లు, బైక్‍లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాలతో పాటు మరిన్ని ప్రొడక్టులను ప్రదర్శించనున్నాయి.