తెలుగు న్యూస్  /  Business  /  Cams, Amazon Pay, 30 Others Get Rbi Nod, 18 Others Under Process: Full List

RBI nod to Amazon Pay: ‘ఆమెజాన్ పే’ కు ఆర్బీఐ అనుమతులు; ఇకపై ఆ సేవలు కూడా..

HT Telugu Desk HT Telugu

15 February 2023, 20:38 IST

  • RBI nod to Amazon Pay: ఆమెజాన్ పే (Amazon Pay) సహా 32 కంపెనీలకు పేమెంట్ అగ్రిగేటర్స్ (payment aggregators) గా కార్యకలాపాలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతులు ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

RBI nod to Amazon Pay: భారత్ లో డిజిటల్ పేమెంట్ విధానం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెజాన్ పే (Amazon Pay) సహా 32 కంపెనీలకు పేమెంట్ అగ్రిగేటర్స్ (payment aggregators) గా కార్యకలాపాలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతులు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

RBI nod to Amazon Pay: ఆర్బీఐ అనుమతి పొందిన సంస్థలు ఇవే..

ఆమెజాన్ పే తో పాటు జొమాటో పేమెంట్ (Zomato Payment), సీఏఎంఎస్ (CAMS), క్యాష్ ఫ్రీ పేమెంట్స్ (Cashfree Payments), గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ (Google India Digital Services), ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్ మెంట్ (NSDL Database Management), రేజర్ పే సాఫ్ట్ వేర్ (Razorpay Software) రిలయన్స్ పేమెంట్ సొల్యూషన్స్ (Reliance Payment Solutions) తదితర 32 సంస్థలకు పేమెంట్ అగ్రిగేటర్స్ (payment aggregators) గా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది.

RBI nod to Amazon Pay: పెండింగ్ లో 18 సంస్థలు

అలాగే, పేమెంట్ అగ్రిగేటర్ (payment aggregators) గా అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్న 18 సంస్థల దరఖాస్తులను ఆర్బీఐ పరిశీలిస్తోంది. అలా పరిశీలన దశలో ఉన్న సంస్థల్లో భారతి పే సర్వీసెస్ (Bhartipay Services), గ్లోబల్ పేమెంట్స్ (Global Payments), లెట్జ్ పే సొల్యూషన్ (Letzpay Solution), ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్ (PhonePe Private Limited) మొదలైనవి ఉన్నాయి.