తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd To Release February Quota Of Darshan Tickets On 27 January 2023

Tirumala DarshanTickets : ఈనెల 27న శ్రీవాణి టికెట్ల కోటా విడుదల - ఇలా బుక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

25 January 2023, 21:38 IST

    • Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవార దర్శనం కోసం శ్రీవాణి ఆన్ లైన్ కోటాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. జనవరి 27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల కానున్నాయి.
తిరుమల దర్శన టికెట్లు
తిరుమల దర్శన టికెట్లు (facebook)

తిరుమల దర్శన టికెట్లు

TTD to Release February Quota of Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 27వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ. శ్రీవాణి కింద ప్రతిరోజూ 1000 టికెట్లు జారీ చేస్తారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

బుకింగ్ ప్రాసెస్

టికెట్లు బుక్ చేసుకునేందుకు ttdsevaonline.com లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేశాక.. అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు….

సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న రథ సప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను మరింత అంకితభావంతో నిర్వహించి రథసప్తమి వేడుకలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లను తెలియజేశారు.

- శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు.

- జనవరి 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

- జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రెండు రోజులు టిబి కౌంటర్ మూసివేస్తారు.

- రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.

- తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.

- వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు.

- ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.

- దర్శన స్లాట్‌లను పాటించని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతి ఇస్తారు.