తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 27, 2024: Cm Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్
CM Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్
CM Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్

Andhra Pradesh News Live September 27, 2024: CM Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్

27 September 2024, 19:55 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

27 September 2024, 19:55 IST

Andhra Pradesh News Live: CM Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్

  • తిరుమల పర్యటనపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అసలు తిరుమల వెళ్ళటానికి జగన్ కే ఇష్టం లేదని విమర్శించారు. వెళ్తే అక్కడ స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాల్సి వస్తుందని గుర్తు చేశారు. సంతకం పెట్టటం ఇష్టం లేకపోవటమే జగన్ అసలు సమస్య అంటూ కౌంటర్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 19:31 IST

Andhra Pradesh News Live: HT Telugu Effect : వరద బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మ చేయవద్దు - బ్యాంకర్లకు కీలక ఆదేశాలు

  • వరద బాధితులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రుణం కింద జమ చేసుకోవటంపై HT తెలుగులో కథనం పబ్లిష్ అయింది. ఇందుకు స్పందించిన ఎన్టీఆర్ జిల్లా అధికారులు… కీలక ఆదేశాలను జారీ చేశారు. బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మచేయవద్దని స్పష్టం చేశారు. ఆటో డెబిట్ అయితే తిరిగి ల‌బ్ధిదారుడికి చెల్లించాలని ఆదేశించారు
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 19:04 IST

Andhra Pradesh News Live: AP Grama Sachivalayam : గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేత..! ఏపీ సర్కార్ నిర్ణయం, ఉత్తర్వులు జారీ

  • ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న గత సర్కార్‌ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 18:08 IST

Andhra Pradesh News Live: AP Weather Alert : రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. కళింగపట్నంలో 10 సెం.మీ వర్షపాతం నమోదు

  • AP Weather Alert : ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 17:41 IST

Andhra Pradesh News Live: Festival Special Trains : భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు - ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

  • పండగల సీజన్ సమీపించిన వేళ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లపై దృష్టిపెట్టింది.  ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 16:44 IST

Andhra Pradesh News Live: AP Nominated Posts : తూర్పుగోదావ‌రి టీడీపీ సీనియ‌ర్ నేతలకు నిరాశే.. పిఠాపురం వ‌ర్మ‌కు మొండిచెయ్యి.. అసంతృప్తిలో నేతలు

  • AP Nominated Posts : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీ నేత‌ల‌కు నిరాశే మిగిలింది. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన సీనియ‌ర్ నేత‌ల‌కు మొండి చెయ్యే మిలిగింది. పిఠాపురం సీటును విడిచిపెట్టిన వర్మకు ప‌ద‌వులు ద‌క్క‌లేదు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 16:43 IST

Andhra Pradesh News Live: YS Jagan : ‘ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది’ - లడ్డూ వివాదంపై బీజేపీకి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

  • ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు.  దేశంలో ఎక్కడా చూడని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగన్.. బీజేపీకి కూడా సూటి ప్రశ్నలు సంధించారు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 15:01 IST

Andhra Pradesh News Live: YS Jagan Tirumala Tour : వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు..!

  • వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల పర్యటన గురించి మాట్లాడే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 13:50 IST

Andhra Pradesh News Live: Jagan Tirumala Tour : ఐదేళ్లు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించినా.. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలా?

  • Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయం కాక మీద ఉంది. అందుకు కారణమైంది జగన్ తిరుమల టూర్. జగన్ ఈనెల 28న శ్రీనివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐదేళ్లు శ్రీవారికి సీఎం హోదా పట్టు వస్త్రాలు సమర్పించినా డిక్లరేషన్ ఇవ్వాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 13:10 IST

Andhra Pradesh News Live: Gannavaram : గ‌న్న‌వ‌రంలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి.. మ‌రో ఇద్ద‌రికి గాయాలు

  • Gannavaram : కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్ట‌ింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ స‌భ్యులు, బంధువుల రోద‌ల‌ను మిన్నంటాయి.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 10:09 IST

Andhra Pradesh News Live: Trains Cancellation: పండుగ సీజన్‌ ప్రయాణ కష్టాలు, ఇంటర్‌ లాకింగ్ పనులతో ప్రత్యేక రైళ్లు రద్దు

  • Trains Cancellation: రైల్వే లైన్ల ఆధునీకీకరణ పనుల కారణంగా పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్ మొదలవుతున్న సమయంలో రైల్వే నిర్ణయంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేట్టు లేవు. 
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 9:17 IST

Andhra Pradesh News Live: Gudivada : కృష్ణా జిల్లాలో ఘోరం.. లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు.. పోక్సో కేసు న‌మోదు

  • Gudivada : కృష్ణా జిల్లాలో ఘోర సంఘట‌న చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. పోక్సో న్యాయ‌మూర్తి ఆదేశాల మేర‌కు ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు పంపారు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 8:52 IST

Andhra Pradesh News Live: Banks Anarchy: ప్రభుత్వ పరిహారం బ్యాంకుల పాలు, పాతబాకీల్లో జమ.. బాధితులకు తప్పని కడగండ్లు…

  • Banks Anarchy: వరద బాధితుల్ని ఆదుకోడానికి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన  పరిహారం పలు చోట్ల బ్యాంకుల పాలైంది. బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో మిగలడంతో ఏపీ ప్రభుత్వం ఉదారంగా పరిహారాన్ని ప్రకటించింది. ముంపు గురైన ప్రతి ఇంటికి గరిష్టంగా రూ.25వేల నుంచి రూ.10వేల పరిహారం ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 6:48 IST

Andhra Pradesh News Live: Pawan on Jagan: హిందువుల అంతర్గత వ్యవహారం,జగన్ డిక్లరేషన్‌ అంశం టీటీడీ చూసుకుంటుందన్న పవన్ కళ్యాణ్‌

  • Pawan on Jagan: తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని, నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులేనని జనసేనాని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 6:12 IST

Andhra Pradesh News Live: Flood Compensation: స్వచ్ఛంధంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71లక్షల మందికి పరిహారం చెల్లింపులు

  • Flood Compensation: బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వరద సాయాన్ని జమ చేస్తున్నారు. ఆధార్‌  ద్వారా  గురువారం సాయంత్రానికి 3.71లక్షల చెల్లింపులు జరిగాయి. మరోవైపు దాదాపు 80వేల మంది స్వచ్ఛందంగా  పరిహారాన్ని వదులుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 5:31 IST

Andhra Pradesh News Live: Palasa Cashew: తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంకు ప‌లాస జీడిప‌ప్పు... 30 ట‌న్నుల లోడుకు జెండా ఊపి పంపిన మంత్రులు

  • Palasa Cashew: తిరుమల తిరుపత దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి  సరఫరా చేయనున్నారు.  30టన్నుల లోడ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు జెండా ఊపి తిరుమలకు పంపారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి