LIVE UPDATES
AP Inter Colleges : ఇంటర్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు - ఎప్పట్నుంచంటే..! (HT_PRINT)
Andhra Pradesh News Live October 11, 2024: AP Inter Colleges : ఇంటర్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు - ఎప్పట్నుంచంటే..!
11 October 2024, 20:32 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: AP Inter Colleges : ఇంటర్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు - ఎప్పట్నుంచంటే..!
- రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల టైమింగ్స్‌లో మార్పు చేశారు. ఇక నుంచి మార్పు చేసిన టైమింగ్స్‌లోనే కాలేజీలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్మీడియేట్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు ఇచ్చారు.
Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్స్ షాపులకు ముగిసిన దరఖాస్తులు - టాప్ లో ఎన్టీఆర్ జిల్లా, 14న లాటరీ
- ఏపీలో వైన్స్ షాప్స్ లైసెన్స్‌లకు సంబంధించిన దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. 90 వేలలోపు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1800 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దరఖాస్తుల్లో ఎన్టీఆర్ జిల్లా టాప్ లో ఉంది.
Andhra Pradesh News Live: రేషన్ కార్డుపై రూ. 110కే పామాయిల్ - రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి - మంత్రి మనోహర్
- విజయవాడలోని రైతు బజార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కే విక్రయించాలని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh News Live: AP Medical Recruitment 2024 : గుంటూరు జిల్లాలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు అక్టోబర్ 30 ఆఖరు తేదీ
- గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://guntur.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
Andhra Pradesh News Live: Kurnool : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం.. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు
- Kurnool : కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగబోతోంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. దసరా పండగ నాడు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరగనుంది.
Andhra Pradesh News Live: Beejapuri To Vijayawda: బీజపురి పేరు విజయవాడ ఎలా అయ్యిందో తెలుసా…అసలు విజయవాడ పేరెందుకు వచ్చిందంటే?
- Beejapuri To Vijayawda: వేల సంవత్సరాల నాగరికతతో విలసిల్లిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో ఓ ముఖ్యమైన పేరు ఉంది. పురాణాల్లో విజయవాడ నగరం పేరు బీజపురి…బీజపురి నుంచి విజయవాడగా పేరు మారడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
Andhra Pradesh News Live: EV Tax Exemption: ఏపీలో ఈవీలు కొనడానికి ఇదే సరైన సమయం.. వాహనాల జీవిత పన్ను మినహాయింపుకు ఉత్తర్వులు జారీ
- EV Tax Exemption: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో వాహన పన్ను రాయితీ గడువు ముగియడంతో నాలుగైదు నెలలుగా వాహనాల కొనుగోళ్లు మందగించాయి. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ గడువు ముగియడంతో కొత్త పాలసీ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది.ఈ నేపథ్యంలో పాత పాలసీ పొడిగిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh News Live: Dasara Liquor Problems: ఏపీలో దసరా పండుగకు తప్పని మందు కష్టాలు..మద్యం విక్రయాల్లో యథేచ్ఛగా దోపిడీ
- Dasara Liquor Problems: ఏపీలో మద్యం దుకాణాల వేలం ఆలస్యం కావడంతో ప్రభుత్వ దుకాణాలు, బార్‌లకు కాసులు కురిపిస్తోంది. దుకాణాల వేలం ఆలస్యం కావడంతో దసరా పండక్కి మందు కటకట తప్పట్లేదు. దుకాణాల్లో నో స్టాక్, ఉన్న చోట దోపిడీ సాధారణమై పోయింది.
Andhra Pradesh News Live: Nandyala : నంద్యాలలో మోసం.. వైద్యుడిని బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. రూ.38 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు
- Nandyala : నంద్యాలలో ఓ వైద్యుడిని సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించారు. మీపై కేసులున్నాయని, వాటి నుంచి మిమ్మల్ని తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఏకంగా రూ.38 లక్షలు కొట్టేశారు. మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు.. నంద్యాల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
Andhra Pradesh News Live: AP Agricet 2024 Results: ఏపీ అగ్రిసెట్ 2024 ఫలితాలు విడుదల, నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో…
- AP Agricet 2024 Results: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరంలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన అగ్రిసెట్ పరీక్షల్లో 93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.ఎన్జీరంగా వర్సిటీలో వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి ఫలితాలను విడుదల చేశారు.
Andhra Pradesh News Live: Railway loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్ హత్య.. రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణం
- Railway loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున లోకో పైలట్ దారుణ హత్యకు గురయ్యాడు. 7వ నంబర్ ప్లాట్‌ఫాం చివర్లో విధుల్లో ఉన్న లోకోపైలట్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.నిందితుడు అంతకు ముందు రైల్వే పరిసర ప్రాంతాల్లో పలువురిపై దాడి చేశాడు.
Andhra Pradesh News Live: Central Tax Share: కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు...తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల
- Central Tax Share: కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3, 745 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.