తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Karthika Masam 2022 : అక్టోబర్ 28 నుంచి శ్రీశైలం కార్తీక మాసం ఉత్సవాలు

Karthika Masam 2022 : అక్టోబర్ 28 నుంచి శ్రీశైలం కార్తీక మాసం ఉత్సవాలు

HT Telugu Desk HT Telugu

17 October 2022, 17:59 IST

    • Srisailam Temple : శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రమరాంబిక అమ్మవారి ఆలయాల్లో పవిత్ర కార్తీక మాసం అక్టోబరు 28 నుంచి నవంబర్ 23 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం కార్తీక మాసం
శ్రీశైలం కార్తీక మాసం (twitter)

శ్రీశైలం కార్తీక మాసం

శ్రీశైలం ఆలయం(Srisailam Temple)లో కార్తీకమాసం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఎస్.లవన్న తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సెలవులు కాకుండా ప్రతి శని, ఆది, సోమవారాల్లో కార్తీక మాసం(Karthika Masam)లో స్పర్శ దర్శనం ఉండదు. భక్తులకు ఈ కాలంలో అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

నవంబర్ 7న కార్తీక పౌర్ణమి, పవిత్ర మాసంలో ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం(Laksha Deepostavam) నిర్వహిస్తామని లవన్న తెలిపారు. అయితే ఆలయంలోని నాగాలకట్ట వద్ద దీపాలు వెలిగించేందుకు భక్తులను అనుమతించరు. వారు గంగాధర మండపం, ఉత్తర మాడ వీధిలో చేయవచ్చు. సంబంధిత శాఖలు పాతాళగంగ, క్యూ లైన్ల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు(Govt Holidays)లలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. కార్తీక మాసోత్సవాల నిర్వహ‌ణ నేప‌థ్యంలో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా ఏర్పాట్లు చేయాల‌ని అన్ని విభాగాల అధికారుల‌ను ఈవో ఆదేశించారు. కార్తీక సోమ‌వారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బ‌హుళ ఏకాద‌శులు, కార్తీక‌మాస శివ‌రాత్రి, ప్రభుత్వ సెల‌వు రోజుల్లో భ‌క్తులు అధికంగా త‌ర‌లివ‌చ్చే వస్తారని, ర‌ద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో చెప్పారు.

ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు జరుగుతాయి. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. దీపావళి పండుగ, కార్తీక మాసం రాబోతుండటంతో ఆలయాలకు భక్తులు భారీగా తరలివెళ్లనున్నారు. కార్తీక మాసంలో కేవలం సోమవారం మాత్రమే కాదు ప్రతిరోజూ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలోనే భగినీ హస్త భోజనం, నాగుల పంచమి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి పండుగలు కూడా ఉన్నాయి.