TTD Cancels Privileged Darshans : తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు-ttd cancels privileged darshans at tirumala during brahmotsavams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Cancels Privileged Darshans : తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

TTD Cancels Privileged Darshans : తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 08:51 PM IST

Tirumala Brahmotsavalu : వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ . అలాగే శ్రీవాణి ట్రస్టు దాతలు, ఇతర ట్రస్టుల దాతలకు ఆర్జిత సేవలు, రూ.300 దర్శనం టిక్కెట్లను సైతం రద్దు చేసింది.

తిరుమల ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల ప్రత్యేక దర్శనాలు రద్దు

రెండేళ్ల తర్వాత ఈ నెల 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమల మాడవీధుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వాహనసేవ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గతంలో బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లో జరగలేదన్న సంగతి తెలిసిందే. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో సామాన్య భక్తులకు మేలు జరిగేలా మాత్రమే సర్వదర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు , వృద్ధులు, వికలాంగులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్టుల దాతలకు ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టిక్కెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలను మాత్రమే అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ కోసం 50 శాతం గదులు అందుబాటులో ఉంచగా, మిగిలిన గదులను తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు ఆఫ్‌లైన్‌లో కేటాయించారు. అక్టోబర్ 1న జరిగే గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రస్టుల దాతలు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.

Tirumala Brahmotsavam Schedule

సెప్టెంబర్ 26 న రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ

సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుంచి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.

సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.

సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.

సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.

అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.

అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.

అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.

అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.

అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణ సేవలు ఉంటాయి.

IPL_Entry_Point