TTD Alert : ఆ రోజుల్లో తిరుమలకు రావొద్దు.. టీటీడీ కీలక ప్రకటన-ttd key announcement to devotees over tirumala visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Alert : ఆ రోజుల్లో తిరుమలకు రావొద్దు.. టీటీడీ కీలక ప్రకటన

TTD Alert : ఆ రోజుల్లో తిరుమలకు రావొద్దు.. టీటీడీ కీలక ప్రకటన

Anand Sai HT Telugu
Aug 09, 2022 09:28 PM IST

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. వరుసగా సెలవులు ఉండడంతో రద్దీ పెరుగుతుందని తిరుమలకు వచ్చేవారు పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పింది. వృద్ధులు, చిన్న పిల్లలు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (HT_PRINT)

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు ఉన్నందున భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ పేర్కొంది. సెలవుల కారణంగా తిరుగిరికి భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, తిరుమలకి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని టీటీడీ ప్రకటించింది.

ముందస్తు ప్రణాళిక ప్రకారం దర్శనం టిక్కెట్లు, రూమ్ బుకింగ్ వంటి సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేసుకున్నవారు వస్తే ఇబ్బంది ఉండొదని టీటీడీ తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 19 వరకు సెలవులు, తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17న ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి నిర్ణీత వేళల్లో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అందువల్ల శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ స్పష్టం చేసింది.

మరోవైపు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత తిరుమాడ వీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనుంది. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని టీటీడీ సూచించింది.

సామాన్య భక్తులకు ఊరటనిస్తూ బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హడావుడిని తట్టుకునేందుకు రోజుకు 9 లక్షల లడ్డూల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నారు.

IPL_Entry_Point