కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?-karthika masam dos and donots ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?

కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?

Himabindu Ponnaganti HT Telugu
Nov 16, 2021 04:34 PM IST

కార్తీక మాసంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అలాగే ఎలాంటి విధి విధానాలు ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకోండి.

కార్తీక దీపం
కార్తీక దీపం ((Photo Credit/Pixabay))

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తుంటారు. శివాలయాలు ఓం కారంతో మారుమోగుతాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల తెలిసి చేసినా, తెలియక చేసిన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. 

చేయకూడని పనులు

కార్తీక మాసం అంతా భక్తులు ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తారు. ఈ మాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. 

-  మాంసాహారం తీసుకోకూడదు. మద్యం సేవించరాదు.

- కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి.

- గుమ్మడి కాయ,  ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, వంటి ఆహార పదార్థాలను తినకూడదు. 

- పెసర పప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకోరాదు. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు.

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. 

- సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కుదిరితే నదీ స్నానం ఆచరించాలి. ఈ మాసంలో తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే తులసి చెట్టుకు  ప్రత్యేక పూజలు చేయాలి.

- రోజూ ఉదయం కార్తీక దీపాలను వెలిగిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ నెల మొత్తం కుదిరితే ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల నిత్యం సంతోషంగా ఉంటారు.

- సోమవారం శివాలయం వెళ్లి శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహం దక్కుతుందని నమ్మకం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్