తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Minister Botsa Satyanarayana Comments On Dsc Notification

Minister Botsa On DSC : డీఎస్సీపై త్వరలో ప్రకటన.. జులై, ఆగస్టులో కార్యాచరణ

HT Telugu Desk HT Telugu

24 March 2023, 8:37 IST

  • DSC Notification : ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటనపై త్వరలో క్లారిటీ వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జులై, ఆగస్టులో కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం.. డీఎస్సీపై (DSC Notification) త్వరలో ప్రకటన వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) తెలిపారు. జులై ఆగస్టులో కార్యాచరణ ఉంటుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన గురువారం మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. దశల వారీగా టీచర్ పోస్టుల(Teacher Jobs) భర్తీ చేసినట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఆదేశాలతో ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని అనే విషయంపై నివేదిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రికి నివేదికను వివరించి.. ఆ తర్వాత ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ విద్య(సవరణ) బిల్లు 2023ని మంత్రి బొత్స సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. మంత్రి, పీడీఎఫ్ ఎమ్మెల్సీల(MLC) మధ్య సంభాషణ జరిగింది. రెండు రోజుల కింద డీఎస్సీ ప్రకటన మీద చర్చ సందర్భంగా.. సభ్యుల ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మండిపడ్డారు.

ఆ సమాధానం.. ఒక విద్యార్థి చెబితే.. 10కి రెండు మార్కులు కూడా ఇవ్వనని బాలసుబ్రమణ్యం అన్నారు. మీరు చేసిన పనికి ఆ రోజు తనకు రెండు వేల మెసేజులు వచ్చాయని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచాలా వద్దా తమరే చెప్పాలని ఎమ్మెల్సీలను అడిగారు.

గత ప్రభుత్వం ఎన్నిక మందు డీఎస్సీ ప్రకటించి.., ఖాలీలు భర్తీ చేయలేదని మంత్రి బొత్స(Minister Botsa) తెలిపారు. వాటిని తాము పూర్తి చేశామన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి రెండేళ్లు పెంచితే ఖాళీలు రావన్నారు. డీఎస్సీ వేశాక.. ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలో మీరే చెప్పండని తెలిపారు. ఇప్పుడు డీఎస్సీపై ప్రకటించే.. విషయం కసరత్తు చేస్తున్నామన్నారు. పదవీ విరమణ వయసు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ప్రభుత్వం పెంచిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అన్నారు.