Shock to YCP: ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి… వైసీపీ పెద్దలు ఇప్పుడేం చెబుతారో..?-ysrcp lose one mlc seat in mla quota mlc elections 2023 in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Lose One Mlc Seat In Mla Quota Mlc Elections 2023 In Ap

Shock to YCP: ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి… వైసీపీ పెద్దలు ఇప్పుడేం చెబుతారో..?

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 09:43 PM IST

AP MLC Results 2023: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఫలితాల్లో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీడీపీ…. మరోసారి గట్టిగా దెబ్బకొట్టింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిని నిలబెట్టి గెలిచి చూపించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్

AP MLA quota MLC elections 2023: ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో భారీ విక్టరీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి.... ఈ ఎన్నికల్లో గటి షాకే తగిలింది. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత.... ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వెనకబడిపోయింది. ఇక అధికార వైసీపీ... తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదే ఊపులో వైసీపీ నేతలు కూడా.... టీడీపీపై మాటల దాడిని పెంచారు. టీడీపీ పని అయిపోయిందంటూ తీవ్రస్థాయిలో కార్నర్ చేశారు. మరోవైపు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్... వై నాట్ 175 అంటూ నేతలకు క్లాసులు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమన్న లెవల్ లో అడుగులు వేస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ లెక్క పూర్తిగా తప్పినట్లు కనిపిస్తోంది.! తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు గట్టి షాక్ ఇచ్చేశారు. ఏకంగా మూడు స్థానాల్లో ఫ్యాన్ పార్టీని ఓడించారు. ఇక ఈ షాక్ నుంచి బయటికి రాకముందే... ఎమ్మెల్యే కోటాలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. కావాల్సిన బలం లేకున్నా... అభ్యర్థిని నిలబెట్టి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇదీ కాస్త... వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సంచలన విజయం...

గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గెలవటం కష్టం అనుకున్న సీటులో అభ్యర్థిని నిలబెట్టి ఎగరేసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నుంచి బరిలో ఉన్న అనురాధకు 19 ఓట్లే ఉంటే.. 23 ఓట్లు పడ్డాయి. ఇందులో రెండు ఓట్లు అధికార పార్టీ నుంచి వస్తాయని ముందే ఊహించినప్పటికీ... మరిన్ని ఓట్లు కూడా అనురాధకు పడటంతో వైసీపీ ఓ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏడు స్థానాలే తమవే అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ... ఓ సీటు కోల్పోవటం సంచలన పరిణమాంగా మారింది. అసలు ఆ రెండు ఓట్లు ఎలా పడ్డాయి...? ఎవరు టీడీపీకి వేశారనే దానిపై చర్చించే పనిలో పడింది ఫ్యాన్ పార్టీ. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే టీడీపీకి ఓటు వేశారన్న చర్చ జోరుగా జరుగుతోంది. దీనిపై అధికారంగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సీక్రెట్ ఓటింగ్ జరగటంతో ఎవరా ఆ ఇద్దరు అనేది తేలేది కాస్త కష్టమనే చెప్పొచ్చు.

అయితే సొంత పార్టీ నేతలే పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థి ఓటమికి కారణం అవ్వడంతో వైసీపీ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనురాధ విజయం ఖాయమవ్వడంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఆయన గెలుపునకు 22 ఓట్లు కావాల్సి ఉండగా, 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయనతో పాటు జయమంగళం కు 21 ఓట్లే వచ్చినా.. రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. నిజానికి ఈ కొద్దిరోజుల కిందట జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వైసీపీ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఏకంగా మూడింటికి మూడు స్థానాల్లోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. నిజానికి ఆయా స్థానాల్లో తామే గెలుస్తామంటూ చెప్పుకొచ్చిన వైసీపీకి... చివర్లో ఓటమి తప్పలేదు. ఫలితాల తర్వాత ఆ పార్టీకి చెందిన సజ్జల మాట్లాడుతూ... ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపవని అన్నారు. అంతేకాదు... తమ పథకాలు అందినవారు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓ రకంగా ఓటమిని కొట్టిపారేసేలా మాట్లాడారు.

ఇంతలోనే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఊహించని ఫలితం రావటంతో ఇప్పుడు వైసీపీ పెద్దలు ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఓటమిలో సొంత పార్టీ సభ్యులే భాగస్వామ్యం కావటంతో హైకమాండ్ కు అతిపెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. మొత్తంగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు... వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే చెప్పొచ్చన్న వాదన మరింత బలపడినట్లు అయింది. మరోవైపు ఈ ఫలితాలు టీడీపీకి మరింత బూస్ట్ ను ఇచ్చినట్లు అయింది.

మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు - 07

టీడీపీ - 01

వైసీపీ -06

పంచమర్తి అనురాధ 23 ఓట్లు

సూర్యనారాయణ రాజు 22 ఓట్లు

మర్రి రాజశేఖర్ 22 ఓట్లు

జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు

యేసు రత్నం 22 ఓట్లు

బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు

పోతుల సునీత 22 ఓట్లు

కోలా గురువులు 21 ఓట్లు

IPL_Entry_Point

సంబంధిత కథనం