Pawan Kalyan : ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి హెచ్చరిక.. వచ్చే ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్-janasena pawan kalyan respond on mlc election results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Pawan Kalyan Respond On Mlc Election Results

Pawan Kalyan : ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి హెచ్చరిక.. వచ్చే ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 08:46 PM IST

Pawan Kalyan : పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలే రిపీట్ అవుతాయని పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి(YCP Govt) ఈ ఫలితాలు హెచ్చరిక అని చెప్పారు. ఏపీ భవిష్యత్ కు పట్టభద్రులు మార్గదర్శకులు అని పేర్కొన్నారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు.. తమ ఓటుతో కనువిప్పు కలిగించారని, బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నిక ద్వారా సందిగ్ధంలో ఉన్న జనాలకు పట్టభద్రులు దారి చూపించారని పవన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారని జనసేనాని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు(MLC Election Results) ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏపీలో ఇలాంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన అందరికీ అభినందనలు అని పవన్ తెలిపారు.

పవన్ వ్యాఖ్యలతో మరోసారి టీడీపీ జనసేన పొత్తు(TDP Janasena Alliance) మీద చర్చ జరుగుతుంది. అయితే ఇటీవలే పవన్ కల్యాణ్(Pawank Kalyan) పొత్తులపై కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టడమే లక్ష్యంగా జనసేన వ్యూహరచన చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. జనసేన దగ్గర డబ్బు లేదని, ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచలేదని, గెలుస్తామనే నమ్మకం కుదిరితే ఒంటరిగానే 175స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

పదేళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు అండగా నిలబడ్డామని పవన్ అన్నారు. సీఎంకు పాలన దక్షత లేక పోవడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనతో సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలని, తమ దగ్గర డబ్బుల్లేవని, డబ్బులు పంచలేమని జనసేనానని స్పష్టం చేశారు. ఎవరి ఓటు వారే కొనుక్కుని జనసేనకు ఓటు వేయాలని సూచించారు.

పొత్తుల మీద టీడీపీ జనసేన(TDP Janasena) అయోమయంలోనే ఉన్నాయి. కలిసి వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కలిసే అవకాశం ఉందని కొంతమంది చెప్పే మాట. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేసేందుకు కలిసే ముందుకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. టీడీపీ, జనసేన మాత్రం పొత్తులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరో ఏడాది వరకూ ఎన్నికలకు టైమ్ ఉంది. అప్పటి లోగా పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జనసేన టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్లే విషయంపై కొంతమంది జనసైనికులు మాత్రం ఆలోచిస్తున్నారు. సింగిల్ గా వెళ్లి పోటీ చేస్తేనే పార్టీకి లాభం అని అంటున్నారు. కలిసి పోటీ చేస్తే.. సీట్ల విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తామని పవన్ కామెంట్స్(Pawan Comments) చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో జనసేన పొత్తుల మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పొత్తుల మీద మరోసారి చర్చ నడుస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం