తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Isro To Put Another Set Of 36 Oneweb Satellites In Orbit By 2023 Jan

ISRO : త్వరలో ఇస్రో మరో ప్రయోగం.. మళ్లీ 36 శాటిలైట్స్.. 1000 కోట్ల ప్రాజెక్టు

HT Telugu Desk HT Telugu

24 October 2022, 16:52 IST

    • ISRO Oneweb Satellites : త్వరలో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. మరో 36 ఉపగ్రహాలను పంపేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
జనవరిలో ఇస్రో మరో ప్రయోగం
జనవరిలో ఇస్రో మరో ప్రయోగం (twitter)

జనవరిలో ఇస్రో మరో ప్రయోగం

శ్రీహరికోట(Sriharkota)లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఎల్‌విఎం3-ఎం2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. ఒన్‌ వెబ్‌ భారత్‌ గ్లోబల్‌, యునైటెడ్‌ కింగ్‌డం (యూకే)తో కుదుర్చుకున్న ఒప్పందంలో కమర్షియల్‌ ఉపగ్రహాలను ప్రయోగించామన్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో షార్‌ ద్వారానే మరో 36 ఉపగ్రహాలు ప్రయగించనున్నారు. ఈ మేరకు ఛైర్మన్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

ఆ కంపెనీతో సుమారు రూ 1000 కోట్ల ఒప్పందం కుదిరినట్టుగా వెల్లడించారు. చంద్రయాన్‌-3 ప్రయోగం ఈ రాకెట్‌ ద్వారానే సాగుతుందన్నారు. సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. మానవ రహిత, మానవ సహిత ఉపగ్రహాలు(Satellites) చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. ఎల్‌విఎం రాకెట్‌ ద్వార ఆదిత్య ఎల్‌ 1, మిషన్‌-2 ప్రయోగం జరుగుతుందని వెల్లడించారు.

భారత అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మకమైన రోజు అని వన్‌వెబ్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ అన్నారు. 'మేం కొన్ని నెలల క్రితం ఉపగ్రహాలను ప్రయోగించమని ఇస్రోకి ఒక అభ్యర్థన చేశాం. ప్రీమియర్ స్పేస్ ఆర్గనైజేషన్ ఒక్కొక్కటి 36 ఉపగ్రహాలను రెండు ప్రయోగాలను నిర్వహించింది."

ఎల్‌వీఎం3-ఎం2/ ఒన్‌వెబ్ ఇండియా-1 (LVM3-M2/OneWeb India-1) మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో తెలిపింది. ఫలితంగా ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు అయింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. ఈ మిషన్ కోసం బ్రిటన్‌కు చెందిన ఒన్‌వెబ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

GSLV MK-3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. మొత్తం 10 టన్నుల పెలోడ్ సామర్థ్యం కలిగిన ఎల్‌వీఎం 3 ఆరు టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 36 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్.. జియోసింక్రనస్ కక్ష్యలో కాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది.