ISRO Launches 36 Satellites: ఇస్రో మరో విక్టరీ.. LVM3 -M2 ప్రయోగం సక్సెస్-36 broadband satellites successfully launched by isro from sriharikota ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  36 Broadband Satellites Successfully Launched By Isro From Sriharikota

ISRO Launches 36 Satellites: ఇస్రో మరో విక్టరీ.. LVM3 -M2 ప్రయోగం సక్సెస్

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 10:05 AM IST

36 OneWeb satellites: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో సక్సెస్ కొట్టింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

నింగిలోకి 36 విదేశీ ఉపగ్రహాలు
నింగిలోకి 36 విదేశీ ఉపగ్రహాలు (twitter)

ISRO successfully launches 36 satellites: ఇస్రో మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3-ఎం2 ప్రయోగం విజయవంతమైంది. 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఆదివారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రయోగించిన రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఎల్‌వీఎం3-ఎం2/ ఒన్‌వెబ్ ఇండియా-1 (LVM3-M2/OneWeb India-1) మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో తెలిపింది. ఫలితంగా ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు అయింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. ఈ మిషన్ కోసం బ్రిటన్‌కు చెందిన ఒన్‌వెబ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

GSLV MK-3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. మొత్తం 10 టన్నుల పెలోడ్ సామర్థ్యం కలిగిన ఎల్‌వీఎం 3 ఆరు టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 36 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్.. జియోసింక్రనస్ కక్ష్యలో కాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది.

ప్రయెగం విజయవంతం కావడంతో శ్రీహారికోటలో సంబరాలు మిన్నంటాయి. ఉపగ్రహాలన్నీ ఖచ్చితమైన ఉద్దేశించిన కక్ష్యలో ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఎల్వీఎం-3ని ప్రయోగించడానికి మాపై నమ్మకం ఉంచినందుకు వన్‌వెబ్ (OneWeb) బృందానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రయోగం విజయవంతం కావటంతపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేతలకు అభినందనలు తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్