తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Vijay Govindam Tour Package From Vijayawada

IRCTC Tour : విజయవాడ - తిరుమల టూర్.. తగ్గిన ప్యాకేజీ ధర

28 May 2023, 16:46 IST

    • IRCTC Tirumala Tour : తిరుపతి వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రెండు రోజులు, ముడు రాత్రుల ప్యాకేజీ ఇది. శ్రీవారిని దర్శనం చేసుకుని రావొచ్చు. తిరుచానూరు సందర్శన కూడా దర్శనం చేసుకోవచ్చు.
విజయవాడ - తిరుమల టూర్ ప్యాకేజీ
విజయవాడ - తిరుమల టూర్ ప్యాకేజీ

విజయవాడ - తిరుమల టూర్ ప్యాకేజీ

IRCTC Tirupati Tour package: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ(IRCTC) టూర్ ఆఫర్ చెప్పింది. రెండు రోజులు, మూడు రాత్రులు ఈ ప్యాకేజీలో వెళ్లి రావొచ్చు. “విజయ్ గోవిందం”(VIJAY GOVINDAM) పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బ్రేక్ ఫాస్ట్, హోటల్, శ్రీవారి దర్శన టికెట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్(Travel Insurance) లాంటి సదుపాయాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ జూన్ 9, 2023వ తేదీన అందుబాటులో ఉంది.

రైలు మెుదటి రోజు సామల్ కోటలో సాయంత్రం 05:40 గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రి 06:20కి వస్తుంది. విజయవాడ 10:50, తెనాలి 11:20 చేరుకుంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

ఇక 2వ రోజు తిరుపతికి ఉదయం 05:10 గంటలకు చేరుకుంటారు. హోటల్‌(Hotel)కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయి అల్పాహారం తర్వాత శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 08:30 గంటలకు మెుదలవుతుంది. దర్శనం రద్దీని బట్టి ఉంటుంది. అనంతరం తిరుచానూరు ఆలయాన్ని సందర్శిస్తారు. 08:30 గంటలకు రైలు తిరుపతి రైల్వే స్టేషన్‌(Tirupati Railway Station) చేరుకుని.. తిరుగు పయనమవుతారు.

ధరల వివరాలు:

ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్ కోసం 3 ఏసీ అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్, కంఫర్ట్ క్లాస్ రెండింటికీ తిరుపతిలో AC వసతి ఉంటుంది. తిరుమల(Tirumala)లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం కల్పిస్తారు. అల్పాహారం, టూర్ గైడ్ సర్వీస్, ప్రయాణపు బీమా అన్ని కలిపి ప్యాకేజీలోనే ఉంటాయి. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీ కోసం రూ.5850, డబుల్ ఆక్యుపెన్సీ కోసం రూ.4720, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.4720గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్ట్ కాసులో సింగిల్ ఆక్యుపెన్సీ రూ.4690, డబుల్ అయితే రూ.3560, ట్రిపుల్ రూ.3560, ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ.2650గా ఉంది. బెడ్ లేకుండా అయితే రూ.2650అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) అధికారిక వెబ్ సైట్ www.irctctourism.com సందర్శించొచ్చు.