తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Araku Tour Package : అరకు అందాలను చూడాలా? మీ కోసమే హాలిడే ప్యాకేజీ

IRCTC Araku Tour Package : అరకు అందాలను చూడాలా? మీ కోసమే హాలిడే ప్యాకేజీ

Anand Sai HT Telugu

03 October 2022, 14:41 IST

    • Visakhapatnam Araku IRCTC Tour Package : అరకు అందాలను చూడాలనుకుంటున్నారా? ప్రకృతిలో గడపాలని ఉందా? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదిగో..
అరకు టూర్
అరకు టూర్

అరకు టూర్

IRCTC Araku Tour Package Details : అరకు అందాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. కొండల్లో కోనల్లో ప్రకృతిలో గడపాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE ప్రకటించింది. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. అక్టోబర్ 8వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి గురువారం తేదీల్లో ఈ టూర్ ను ఉంటుంది. హోటల్ వసతి, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇందులో కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

Day 1 : విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్/ బస్టాండ్‌ నుంచి టూర్ మెుదలవుతుంది. అక్కడ నుంచి క్యాబ్ లో హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయి అల్పాహారం ముగించుకోవాలి. ఆ తర్వాత తోట్లకొండ బౌద్ధ కాంప్లెక్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, రుషికొండ బీచ్ చూపిస్తారు. భోజనం తర్వాత కైలాష్ గిరి, (సబ్‌మెరైన్ మ్యూజియం, సోమవారం సెలవు), బీచ్ రోడ్ (డ్రైవ్ త్రూ) ఫిషింగ్ హార్బర్‌లో బోటింగ్ చేయోచ్చు. సాయంత్రం తిరిగి హోటల్‌కి వస్తారు.

DAY 02: అల్పాహారం తర్వాత అరర్కుకు వెళ్లాలి. టైడా జంగిల్ బెల్స్ (10 నిమిషాల విరామం) పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, లంచ్ బ్రేక్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించాలి. సాయంత్రం తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్‌లో డిన్నర్ చేసి బస చేస్తారు.

Day 3 : అల్పాహారం తర్వాత హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 17905గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.10595 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.8160గా నిర్ణయించారు. హోటల్ వసతి, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇందులో కవర్ అవుతాయి.