Brandix : విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో అమ్మోనియా లీక్-ammonia leak in visakhapatnam brandix apparel sez ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ammonia Leak In Visakhapatnam Brandix Apparel Sez

Brandix : విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో అమ్మోనియా లీక్

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 02:18 PM IST

విశాఖను విషవాయువులు విడిచిపెట్టడం లేదు. సురక్షితమైన నగరంలో తరచూ పారిశ్రామిక విషవాయువుల లీక్‌ అవ్వడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా బ్రాండిక్స్‌లో అమ్మోనియా లీక్ అవ్వడంతో పెద్ద ఎత్తున మహిళలు అస్వస్థతకు గురయ్యారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

విశాఖజిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అమ్మోనియా లీక్‌ అవ్వడంతో పదుల సంఖ్యలో మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సెజ్‌లో ఉన్న పోరస్‌ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీకవడంతో పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో అమ్మోనియా విషవాయువు లీక్‌ అవ్వడంతో వందమందికి పైగా మహిళలు అస్వస్థతకు గురయ్యారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెజ్‌లో విషవాయువులు వ్యాపించడంతో మహిళా కార్మికులు తలతిరిగి పడిపోవడం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. బాధితుల్ని వెంటనే బ్రాండిక్స్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనలో వందమందికి పైగా కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఫ్యాక్టరీలో 25-330వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కూడా పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారు. అమ్మోనియా గ్యాస‌‌ లీకేజీని సకాలంలో గుర్తించకపోవడంతో కార్మికులు విషవాయువులు పీల్చి వాంతులు, తల తిరగడం వంటి సమస్యలతో కుప్పకూలిపోయారు. 

అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న క్వాంటం సీడ్స్‌ కంపెనీ నుంచి గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గ్యాస్ లీకైన ఫ్యాక్టరీని పరిశీలించారు. మరోవైపు విశాఖపట్నంలో తరచూ గ్యాస్‌ లీక్‌ ఘటనలు జరుగుతుండటంతో శుక్రవారం సాయంత్రం విశాఖలో హైలెవల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీలలో ప్రమాదాల నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు బ్రాండిక్స్‌ ప్రాంగణంలో అమ్మోనియా లీకేజీని అరికట్టామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నారని బ్రాండిక్స్‌ సీఈవో దొరస్వామి ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందిస్తున్నామని ప్రకటించారు.

IPL_Entry_Point

టాపిక్