IRCTC Tourism Announced tour package: దేశంలోని ముఖ్యమైన ఆలయాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందుబాటులో ధరలో సందర్శన చేయిస్తుంది. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి జై కాశీ విశ్వనాథ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ లో ప్రయాగ్ రాజ్, సార్ నాథ్, వారణాసి లాంటి ప్రాంతాలను సందర్శించోచ్చు. అక్టోబర్ 9న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతీ ఆదివారం తేదీల్లో ఈ టూర్ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
Day 1 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9.25 గంటలకు బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 2 : మధ్యాహ్నం 1.30 గంటల వారణాసి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం గంగా హారతి ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.
Day 3 : మూడో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ్ మందిర్, కాల్ భైరవ మందిర్, బీహెచ్ యూ మందిర్ లను సందర్శిస్తారు. షాపింగ్ చేసుకునే సమయం కూడా ఉంటుంది. రాత్రి వారణాసిలోనే ఉంటారు.
Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత సార్ నాథ్ వెళ్తారు. అక్కడ నుంచి ప్రయాగ్ రాజ్ కు వెళ్తారు. మార్గమధ్యంలో వింద్యాచల్ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. రాత్రి వరకు ప్రయాగరాజ్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.
Day 5 : ఉదయం త్రివేణి సంగమానికి వెళ్తారు. అనంతరం హోటల్ కి వెళ్లి.. మధ్యాహ్నం చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, కుస్రో బాగ్ కు వెళ్తారు. సాయంత్రం వరకు ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 6 : రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.28,030 ధరగా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ. 17,080 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.13,800 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లొచ్చు.