తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Alert : మండే ఎండల్లో ఏపీకి చల్లటి కబురు... రేపు, ఎల్లుండి వర్షాలు..!

AP Weather Alert : మండే ఎండల్లో ఏపీకి చల్లటి కబురు... రేపు, ఎల్లుండి వర్షాలు..!

HT Telugu Desk HT Telugu

21 April 2023, 18:29 IST

    • Weather Updates Telugu States: ఓవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే పలు జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన (unsplash.com)

ఏపీకి వర్ష సూచన

Rain Alert to Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మండే ఎండల్లో ఏపీకి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ఇచ్చింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

రేపు, ఎల్లుండి వర్షాలు…

ఐఎండీ అంచనాల ప్రకారం శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. శుక్రవారం 10 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపింది .అదేవిధంగా విదర్భ నుండి తెలంగాణ మీదుగా దక్షిణతమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గనుందని అంచనా వేసింది. అలాగే రేపు(శనివారం) అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి(ఆదివారం) గుంటూరు,పల్నాడు, బాపట్ల,ప్రకాశం,నెల్లూరు,తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలంలో పని చేసే రైతులు,కూలీలు,పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించింది.

Telangana: ఇక తెలంగాణలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన పేర్కొంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇక రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తగినంత స్థాయిలో నీరు తాగాలని చెబుతున్నారు. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకువాలని అంటున్నారు.బయటికు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.