తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

04 May 2024, 13:05 IST

    • AP LAWCET 2024 Registration Updates : ఏపీ లాసెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 
ఏపీ లాసెట్ ప్రవేశాలు - 2024
ఏపీ లాసెట్ ప్రవేశాలు - 2024

ఏపీ లాసెట్ ప్రవేశాలు - 2024

AP LAWCET 2024 Updates : ఏపీ లాసెట్ - 2024 దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఇవాళ్టితో(మే 4)నే అప్లికేషన్ల సమయం ముగియనుంది. https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

ఏపీ లాసెట్ - 2024(AP LAWCET ) ప్రవేశ పరీక్ష ద్వారా…. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University) నిర్వహిస్తోంది.

జూన్ 09వ తేదీన ఏపీ లాసెట్ 2024 పరీక్ష జరగనుంది. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో మే 5 నుంచి మే 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 30వ తేదీ నుంచి కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి లాసెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How to apply AP LAWCET 2024 : ఏపీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్

  • అర్హత గల అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే registration అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • ముందుగా అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ చేసి మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • దరఖాస్తు కాపీని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి పొందవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఏపీ లాసెట్ దరఖాస్తు ఫీజు వివరాలు :

  • ఏపీ లాసెట్ - 2024లో భాగంగా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల కోసం రిజిస్ట్రేషన్(AP Lawcet Registration) ఓసీ అభ్యర్థులు రూ.900 ఫీజును చెల్లించారి.
  • బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి.
  • పీజీ కోర్సులకు(LLM) ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
  • కేవలం ఆన్ లైన్ పేమెంట్ విధానంలో వీటిని చెల్లించాలి.
  • రూ.1000 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో మే 29 వరకు అభ్యర్థులు ఏపీ లాసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్షలు జూన్‌ 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/LAWCET/

Direct link to apply for AP LAWCET 2024: ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ లాసెట్ - 2024కు డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు. 

తదుపరి వ్యాసం