TS LAWCET 2024 Updates : అలర్ట్... తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ముఖ్య తేదీలివే-ts lawcet 2024 applications deadline extended again till may 4 check the full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 Updates : అలర్ట్... తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ముఖ్య తేదీలివే

TS LAWCET 2024 Updates : అలర్ట్... తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 26, 2024 02:35 PM IST

TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్(TS LAWCET 2) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 25వ తేదీతో గడువు ముగియగా… మరోసారి గడువును పెంచుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ లాసెట్ - 2024
తెలంగాణ లాసెట్ - 2024

TS LAWCET 2024 Update : తెలంగాణ లాసెట్(TS LAWCET 2024) ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ అందింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం లాసెట్ అప్లికేషన్ల గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అయితే మరో పది రోజులు పొడిగించటంతో ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. అయితే ఈ గడువు కూడా పూర్తి కావటంతో…. మరోసారి దరఖాస్తుల గడువును పెంచారు. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా ప్రకటన ప్రకారం… మే 4వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా లాసెట్(Telangana LAWCET 2024) ఎంట్రెన్స్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3వ తేదీన జరగనుంది. ఓబీసీలు దరఖాస్తు రుసుం రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఉంటుంది. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.

లాసెట్ పరీక్ష తేదీ - వివరాలు

  • టీఎస్ లా సెట్ (3 ఏళ్ల ఎల్ఎల్బీ)- జూన్ 3 ( ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు)
  • టీఎస్ లా సెట్ (5 ఏళ్ల ఎల్ఎల్బీ) -జూన్ 3 ( మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)
  • టీఎస్ పీజీఎల్ సెట్ (LL.M.)- జూన్ 3 ( మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)

సంబంధిత కథనం