తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rain Alert To Ap : ఏపీలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు

Rain Alert To AP : ఏపీలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

05 October 2022, 17:36 IST

    • Weather Update To Andhra Pradesh : రానున్న కొద్దిరోజుల పాటు ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
ఏపీలో వర్షం
ఏపీలో వర్షం

ఏపీలో వర్షం

రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్రా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం(Visakhapatnam) నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు(Guntur), ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో అక్టోబర్ 6 తర్వాత ఒకటి రెండు చోట్ల చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడప​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనుంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు చెప్పారు.

మరోవైపు బుధవారం నుంచి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎల్లో అలర్ట్(Yellow Alert) కూడా జారీ చేశారు. ఇవాళ కూడా కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

తెలంగాణ(Telangana)లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 5న రంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అక్టోబర్ 6న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.