బుధవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు నగరంలో ఓ మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎల్లో అలర్ట్(Yellow Alert) కూడా జారీ చేశారు. ఇవాళ కూడా కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
తెలంగాణ(Telangana)లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 5న రంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబర్ 6న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో అక్టోబర్ 6 తర్వాత ఒకటి రెండు చోట్ల చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనుంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు చెప్పారు.
సంబంధిత కథనం