Rain Alert Telangana: అల్పపీడనం ఎఫెక్ట్… ఇవాళ, రేపు భారీ వర్షాలు!-weather updates of telangana over low pressure in bay of bengal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Updates Of Telangana Over Low Pressure In Bay Of Bengal

Rain Alert Telangana: అల్పపీడనం ఎఫెక్ట్… ఇవాళ, రేపు భారీ వర్షాలు!

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 08:08 AM IST

rain alert telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Rains in Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఎల్లో అలర్ట్…

తెలంగాణ(Telangana)లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 5న రంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అక్టోబర్ 6(గురువారం)న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు…

Raisn in Andhrapradesh: ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో అక్టోబర్ 6 తర్వాత ఒకటి రెండు చోట్ల చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడప​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనుంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు చెప్పారు.

IPL_Entry_Point