Heavy rains alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్!
Rains in India : దేశంలో విస్త్రతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy rains alert : దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ (భారత వాతావరణ శాఖ). అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పండుగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న వేళ.. వర్షాలపై ఐఎండీ అలర్ట్ జారీ చేయడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్‌లో మంగళవారం నుంచి 22వ తేదీ వరకు వర్షాలు పడతాయి. సంబంధిత రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Rains in North India : ఐఎండీ అలర్ట్..
ఈ నెల 19 నుంచి 21 వరకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఝార్ఖండ్‌లో ఈ నెల 20న, పశ్చిమ్ బెంగాల్లో సోమవారం, విదర్భాలో 21-22 తేదీల్లో, తూర్పు మధ్యప్రదేశ్‌లో 20-23 మధ్య వానలు విస్తృతంగా పడతాయి.
పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఈ నెల 22-23 మధ్యలో వర్షాలు కురుస్తాయి. గుజరాత్, మరాఠావాడా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, ఉత్తర కోంకణ్‌లో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Rains in Andhra Pradesh : ఇక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాంలో 19,20న భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో 19-21 మధ్యలో వానలు పడతాయి.
ఉత్తరాఖండ్‌లో సోమవారం, ఆగ్నేయ ఉత్తర్‌ప్రదేశ్‌లో 21న జోరుగా వర్షాలు కురుస్తాయి.
Rain alert to Northeast India : ఈశాన్య భారతంలో ఇలా..
Assam rains : అరుణాచల్‌ప్రదేశ్‌లో ఈ నెల 20 నుంచి 23 వరకు, అసోం- మేఘాలయ వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ నెల 19-20 మధ్యలో వర్షాలు కురుస్తాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యంగా ఈ నెల 22-23 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
సంబంధిత కథనం
Uttar Pradesh rains : భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి!
September 17 2022
Rains in Telangana and Andhra: తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి
September 12 2022
Heavy Rains In Hyderabad : భాగ్య నగరానికి భారీ వర్షాలు....
September 10 2022