Telangana Rains: రెయిన్ అలర్ట్… మరో 2 రోజులు మోస్తరు వర్షాలు-weather updates of telangana over rain alert issued by met hyd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains: రెయిన్ అలర్ట్… మరో 2 రోజులు మోస్తరు వర్షాలు

Telangana Rains: రెయిన్ అలర్ట్… మరో 2 రోజులు మోస్తరు వర్షాలు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 08:25 AM IST

IMD Rain Alert: తెలంగాణలోని పలుచోట్ల మరో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

మరో 2 రోజులు వర్షాలు (ఫైల్ ఫొటో)
మరో 2 రోజులు వర్షాలు (ఫైల్ ఫొటో) (met hyd)

Rains in Telangana: ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఫలితంగా తెలంగాణలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.

శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఇవాళ కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కోఠి, సుల్తాన్ బజార్, అసెంబ్లీ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో వాన పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

నైరుతి రుతుపవనాలకు ముగింపు..!

Southwest Monsoon ends : మరోవైపు శుక్రవారం(సెప్టెంబర్ 30)తో నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా అధికారికంగా ముగిసింది! మొత్తం మీద ఈ ఏడాది.. 7శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా 2022 రుతుపవనాల సీజన్​ను సగటు కన్నా అధిక వర్షపాతంగా పరిగణించవచ్చు అని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.

2021లో ఎల్​పీఏ(లాంగ్​ పీరియడ్​ యావరేజ్​)లో 99శాతం వర్షపాతం నమోదైంది. దానిని సాధారణ రుతుపవనాలుగా పరిగణించారు. ఇక 2020లో ఎల్​పీఏలో 109శాతం వర్షపాతం నమోదుకావడంతో దానిని సాధారణం కన్నా ఎక్కువ అని పరిగణించారు. ఇక 2019లో అది 110శాతంగా ఉంది.

ఈ ఏడాది రుతుపవనాల విషయంలో కాస్త భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. సాధారణంగా సెప్టెంబర్​ చివర్లో వర్షాలు ఎక్కువగా పడవు. కానీ ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్​ చివరి రెండు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుశాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్​లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంత జరిగినా.. తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం 18శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. వాయువ్య భారతంలో 1శాతం ఎక్కువ వర్షపాతం, మధ్య భారతంలో 19శాతం అధికం, భారత ద్వీపకల్పంలో 22శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.

Southwest monsoon in India : బిహార్​లో అత్యధికంగా 31శాతం, ఉత్తర్​ప్రదేశ్​లో 28శాతం, ఝార్ఖండ్​లో 21శాతం, మణిపూర్​లో 47శాతం, మిజోరాంలో 22శాతం, త్రిపురలో 24శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పంటలు సరిగ్గా చేతికి అందలేదు! రష్యా ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా పెరిగిపోయిన ఆహార ద్రవ్యోల్బణంతో పాటు ఇది మరింత ప్రతికూలంగా మారింది.

Rains in India : ఎల్​పీఏలో 90శాతం దిగువన వర్షపాతం నమోదైతే దానిని లోటు అని అంటారు. 90-96శాతం మధ్యలో వర్షపాతం ఉంటే దానిని సాధారణం కన్నా తక్కువ అని పరిగణిస్తారు. 96-104శాతంగా ఉంటే దానిని సాధారణంగాను, 104-110శాతంగా ఉంటే అప్పుడు దానిని సాధారణం కన్నా ఎక్కువగాను గుర్తిస్తారు. ఇక 110శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. దానిని అధిక వర్షపాతం అని అంటారు.

గురువారం నాటికి పంజాబ్​, ఛండీగఢ్​, ఢిల్లీ, జమ్ముకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, రాజస్థాన్​ల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి అని ఐఎండీ స్పష్టం చేసింది.

IPL_Entry_Point