తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tiger Cubs: ఆరోగ్యంగా పులి కూనలు... రెండేళ్ల తర్వాతే అడవిలోకి...!

Tiger Cubs: ఆరోగ్యంగా పులి కూనలు... రెండేళ్ల తర్వాతే అడవిలోకి...!

HT Telugu Desk HT Telugu

11 March 2023, 8:14 IST

    • Tiger Cubs Updates: ఆపరేషన్ టైగర్ 108 విఫలమైన సంగతి తెలిసిందే. ఫలితంగా పులి కూనల్ని తిరుపతి జూకు తరలించారు అధికారులు. ప్రస్తుతం నిపుణుల సంరక్షణలో ఉన్నాయి. అయితే వీటిని ఎప్పుడు అడవుల్లోకి వదులుతారనే దానిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
పులి పిల్లలు
పులి పిల్లలు

పులి పిల్లలు

Tiger cubs shifted to Tirupati Zoo: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ శివార్లలో కనిపించిన నాలుగు కూనలను తల్లి దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించని సంగతి తెలిసిందే. పులిజాడల్ని గుర్తించి కూనల్ని తల్లి గుర్తించేలా ఎన్‌క్లోజర్‌లో ఉంచినా కూనల చేరువలో పెద్ద పులి రాలేదు. ఫలితంగా అటవీ అధికారులు చేపట్టిన భారీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఆ నాలుగు పులి కూనల్ని తిరుపతి జూకు తరలించిన అధికారులు.... వాటి బాగోగులను చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి..? ఎన్ని రోజుల తర్వాత అడవిలోకి వదులుతారు..? నాలుగు కూనలు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయా..? అనే దానిపై అధికారులు పలు వివరాలను వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

ప్రస్తుతం నాలుగు పులి కూనలు తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలో ఉన్నాయి. శుక్రవారమే వీటిని తరలించారు. నిపుణల పర్యవేక్షణలో వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. 50 రోజుల వయసున్న పులి కూనలను వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తామని జూ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడే వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. పిల్లల వయసు... రెండేళ్లు వచ్చే వరకు జూలోనే ఉంటాయని వెల్లడించారు. స్వతహాగా వేటాడే స్థితికి చేరుకునే వరకు జూలోనే సంరక్షిస్తామని చెప్పారు. నాలుగు పులి పిల్లల్లో... మూడు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. ఇందులో ఒకదాని పరిస్థితి నీరసంగా ఉందని.. వైద్యసేవలు కొనసాగుతున్నాయని ప్రకటించారు.

ఆపరేషన్ ఫెయిల్...

దొరికిన నాలుగు పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సోమవారం పులి కూనలు దొరికిన తర్వాత తల్లి పులి అచూకీ కోసం అటవీశాఖ విస్తృతంగా గాలింపు చేపట్టింది. బుధవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న పులిని గొర్రెల కాపరి గుర్తించాడు. మరో ఆటో డ్రైవర్‌ కూడా దానిని చూడటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. కూనలు దొరికిన పరిసర ప్రాంతాల్లోనే తిరుగుడుండటంతో అధికారులు సంబర పడ్డారు. పులి జాడ తెలియడంతో బుధవారం అర్ధరాత్రి పెద్దగుమ్మడాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి పిల్లలను తీసుకెళ్లిన అధికారులు ఎన్‌క్లోజరులో వాటిని ఉంచి నిరీక్షించారు. ఆరు బయట ప్రదేశం కావడం, పులి పిల్లలు భయపడుతుండటంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బైర్లూటిలోని అటవీశాఖ అతిథి గృహానికి తీసుకొచ్చేశారు.

రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరా, ప్లగ్‌ మార్క్‌ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇవేమి తల్లి పులి దృష్టిని ఆకర్షించలేదని అధికారలు వివరించారు. పులి జాడలు దొరకడంతో కూనల కథ సుఖాంతం అయ్యినట్లు భావించినా చివరకు నిరాశ తప్పలేదు.

50 మందికిపైగా అటవీ అధికారులతో మొత్తంా 300 మంది సిబ్బందితో ఆపరేషన్‌ మదర్ టైగర్‌ కోసం వినియోగించినట్లు తెలిపారు. పులి అన్వేషణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వెల్లడించారు. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఉడికించిన చికెన్ లివర్ ముక్కలను అందించారు. చివరిక ఆపేరషన్ ఫెయిల్ కావటంతోనే.... తిరుపతి జూకు తరలించారు.