తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Odisha Train Accident: ఏపీ మీదుగా వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు - ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే

Odisha Train Accident: ఏపీ మీదుగా వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు - ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

03 June 2023, 8:06 IST

    • South Central Railway Updates: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
భారీగా రైళ్ల రద్దు
భారీగా రైళ్ల రద్దు

భారీగా రైళ్ల రద్దు

South Central Railway Latest News: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం కారణంగా భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

విజయవాడ - రాజమండ్రి

రాజమండ్రి - విజయవాడ

రాజమండ్రి - విశాఖపట్నం

విశాఖపట్నం - రాజమండ్రి

కాకినాడ పోర్టు - విశాఖపట్నం

విశాఖపట్నం - కాకినాడ పోర్టు

విజయవాడ - కాకినాడ పోర్టు

గుంటూరు - విశాఖపట్నం

విశాఖపట్నం - విజయవాడ

విజయవాడ - విశాఖపట్నం

ఇక విశాఖపట్నం - గుంటూరు, దన్ బాద్- అలెప్పీ, టాటా నగర్ - బెంగళూరు, హటియా - బెంగళూరు మధ్య నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), హావ్‌డా-హైదరాబాద్‌(18045), హావ్‌డా-తిరుపతి(20889), హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు:

రైల్ నిలయం, సికింద్రాబాద్ - 040 - 27788516

విజయవాడ రైల్వే స్టేషన్ - 0866 - 2576924

రాజమండ్రి రైల్వే స్టేషన్ - 0883 - 2420541

రేణిగుంట రైల్వే స్టేషన్ - 9949198414.

తిరుపతి రైల్వే స్టేషన్ - 7815915571

ఒడిశా వద్ద కోరమాండల్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

- ఒడిశా,బాలసోర్ 06782-262286

-విజయవాడ - 0866 2576924

-రాజమండ్రి - 08832420541

-సామర్లకోట - 7780741268

-నెల్లూరు - 08612342028

-ఒంగోలు -7815909489

-గూడూరు -08624250795

-ఏలూరు -08812232267

రద్దు అయిన రైళ్ల వివరాలు