తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Train Accidents In India : గౌతమి ఎక్స్​ప్రెస్​ నుంచి కోరమండల్​ వరకు.. మాటలకందని విషాదాలెన్నో!

Train Accidents In India : గౌతమి ఎక్స్​ప్రెస్​ నుంచి కోరమండల్​ వరకు.. మాటలకందని విషాదాలెన్నో!

Sharath Chitturi HT Telugu

03 June 2023, 7:09 IST

    • Train Accidents In India : ఒడిశా రైలు ప్రమాదంతో దేశం ఉలిక్కిపడింది. అయితే గత దశాబ్ద కాలంలో అనేక రైలు ప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మాటలకందని విషాదాన్ని మిగిల్చాయి.
ఒడిశా రైలు ప్రమాదం..
ఒడిశా రైలు ప్రమాదం.. (ANI)

ఒడిశా రైలు ప్రమాదం..

Biggest train Accidents In India : ఒడిశా రైలు ప్రమాదం ఘటన యావత్​ దేశాన్ని షాక్​కు గురిచేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్షతగాత్రుల సంఖ్య 900 దాటిపోయింది. ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే.. గత దశాబ్దంలో అనేక రైలు ప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వీటిల్లో కొన్ని మాటలకందని విషాదాన్ని మిగిల్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

గౌతమి ఎక్స్​ప్రెస్​ నుంచి కోరమండల్​ వరకు..

2008 జులై 31:- సికింద్రాబాద్​ నుంచి కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్​ప్రెస్​కు మంటలు అంటుకున్నాయి. కేసముద్రం- తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్లకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు బోగీలు పూర్తిగా దహనమైపోయాయి. 32మంది అగ్నికి ఆహుతయ్యారు.

2011 జులై 7:- ఉత్తర్​ ప్రదేశ్​ ఈటాహ్​కు సమీపంలో ఛప్రా- మథురా ఎక్స్​ప్రెస్​ ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. రైలు హైస్పీడ్​లో వస్తున్న సమయంలోనే పట్టాలను దాటేందుకు బస్సు ప్రయాణించడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరకిలోమీటర్​ వరకు బస్సును ఈడ్చుకెళ్లింది రైలు.

Odisha train accident live : 2012:- భారతీయ రైల్వే చరిత్రలో 2012 ఏడాదిని అతి ఘోరమైన సంవత్సరంగా భావిస్తుంటారు. ఒక్క ఏడాదిలో 14కుపైగా ప్రమాదాలు జరిగాయి. రైళ్లు పట్టాలు తప్పడాలు, రైళ్లు పరస్పరం ఢీకొనడాలు తరచుగా వార్తలకెక్కేవి.

2012 జులై 30:- నెల్లూరుకు సమీపంలో ఢిల్లీ- చెన్నై తమిళనాడు ఎక్స్​ప్రెస్​కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు.

2014 మే 26:- ఉత్తర్​ ప్రదేశ్​ సంత్​ కబీర్​ నగర్​ ప్రాంతంలోని ఖలలాబాద్​ స్టేషన్​లో ఆగి ఉన్న గూడ్స్​ రైలును గోరఖ్​పూర్​ వెళుతున్న గోరఖ్​ధామ్​ ఎక్స్​ప్రెస్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25మంది మరణించారు. 50మంది గాయపడ్డారు.

2015 మార్చ్​ 20:- డెహ్రాడూన్​ నుంచి వారణాసి వెళుతున్న జనతా ఎక్స్​ప్రెస్​.. ఉత్తర్​ ప్రదేశ్​ రాయ్​బరేలీలోని బచ్రవాన్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్​తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు. 150మంది గాయపడ్డారు.

2016 నవంబర్​ 20:- కాన్పూర్​లోని పుఖ్రాయన్​కు సమీపంలో ఇండోర్​- పట్నా ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 150మంది గాయపడ్డారు.

Odisha train accident live updates : 2017 ఆగస్ట్​ 19:- హరిద్వార్​ నుంచి పూరి వెళుతున్న కలింగ ఉత్కల్​ ఎక్స్​ప్రెస్​.. ఉత్తర్​ ప్రదేశ్​ ముజాఫర్​నగర్​లో ప్రమాదానికి గురైంది. 14 బోగీలు పట్టాలు తప్పాయి. 21మంది మరణించారు. 97మంది గాయపడ్డారు.

2017 ఆగస్ట్​ 23:- ఉత్తర్​ ప్రదేశ్​ ఔరియాకు సమీపంలో కైఫియత్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70మంది గాయపడ్డారు.

2022 జనవరి 13:- బికనీర్​- గౌహత ఎక్స్​ప్రెస్​కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ్​ బెంగాల్​ అలీపుర్​దౌర్​కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 9మంది మరణించారు. 36మంది గాయపడ్డారు.

2023 జూన్​ 2:- ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో (జూన్​ 3 ఉదయం 6 గంటల వరకు) మృతుల సంఖ్య 207కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

1981 నుంచి 2022 వరకు..

1981:- బిహార్‌లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది మరణించారు.

1995:- ఉత్తర్​ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద దిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌.. కలిండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది చనిపోయారు.

Odisha train accident death toll : 1999:- అసోంలోని గైసోల్‌ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 290 మంది మరణించారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించడటం సంచలనంగా మారింది.

1998:- కోల్‌కతా వెళుతున్న జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌.. ఖన్నా-లుథియానా సెక్షన్‌లో పట్టాలు తప్పిన.. గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

2002:- హౌరా నుంచి దిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 140 మంది చనిపోయారు.

తదుపరి వ్యాసం