తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 24, 2024: Karimnagar Master Plan : కరీంనగర్ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్, ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 24 Sep 202405:13 PM IST
Telangana News Live: Karimnagar Master Plan : కరీంనగర్ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్, ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ
- Karimnagar Master Plan : కరీంనగర్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సుడా ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Tue, 24 Sep 202404:57 PM IST
Telangana News Live: Ordnance Factory Apprentice : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 361 ఖాళీలు, ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐలో అప్రెంటిస్ మేళా నిర్వహణ
- Ordnance Factory Apprentice : మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో 361 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐ కాలేజీలో నిర్వహించి ట్రేడ్ అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.
Tue, 24 Sep 202404:36 PM IST
Telangana News Live: Mlc Election Voters : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు- ఈ నెల 30 నుంచి ఓటర్ల నమోదు ప్రారంభం
- Mlc Election Voters : నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి.
Tue, 24 Sep 202404:10 PM IST
Telangana News Live: CM Revanth Reddy : ఆక్రమణల్లో ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించండి - సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో నివసించే అర్హులైన పేదలకు భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలన్నారు.
Tue, 24 Sep 202402:57 PM IST
Telangana News Live: YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై యువతి ఫిర్యాదు, పెళ్లిపేరుతో రూ.2 కోట్లు చీట్ చేశాడని ఆరోపణ
- YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను చీట్ చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయితో పాటు అతడి తండ్రిపై యువతి ఫిర్యాదు చేసింది.
Tue, 24 Sep 202412:27 PM IST
Telangana News Live: TG School Closed : నెల రోజులుగా మూతపడిన గురుకుల పాఠశాల.. కారణం తెలిస్తే.. ముక్కున వేలేసుకుంటారు!
- TG School Closed : ఖమ్మం జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వర్షాలు, వరదలు తగ్గాక అన్ని పాఠశాలలను రీ ఓపెన్ చేశారు. కానీ.. ఒక్క గురుకుల పాఠశాల మాత్రం ఇప్పటికీ మూతపడే ఉంది. అది కూడా మంత్రి ఇలాకాలో కావడం గమనార్హం.
Tue, 24 Sep 202411:53 AM IST
Telangana News Live: Hanamkonda : పిడుగుపడి చెలరేగిన మంటలు.. కరిగిపోయిన బంగారం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం!
- Hanamkonda : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చాలా చోట్లా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా.. ఈదురు గాలులతో కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్లా పిడుగులు బీభత్సం సృష్టించాయి.
Tue, 24 Sep 202411:28 AM IST
Telangana News Live: Mla Mahipal Reddy : ఎమ్మెల్యే పార్టీ మారినా కానిస్టేబుల్ కూడా మాట వినటం లేదట!
- Mla Mahipal Reddy : పటాన్ చెరులో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు పోలీసులు భద్రత కల్పించలేదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మండలాల నుంచి 1000 మంది బాలబాలికలు క్రీడోత్సవాలకు హాజరవుతున్నా భద్రతకు కనీసం ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేదని ఎమ్మెల్యే మండిపడ్డాడు.
Tue, 24 Sep 202409:53 AM IST
Telangana News Live: Telangana Police : పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్.. మరీ ఇంత ఘోరమా?
- Telangana Police : తెలంగాణలో కొందరు పోలీసులు డబ్బు కోసం దిగజారిపోతున్నారు. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ డబ్బు కోసం భార్యభర్తల మధ్య గొడవ పెట్టించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తి డిమాండ్ చేస్తున్నారు.
Tue, 24 Sep 202409:13 AM IST
Telangana News Live: KTR on Hydra : గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?: కేటీఆర్
- KTR on Hydra : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదళ్ల గూడు కూల్చుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tue, 24 Sep 202408:35 AM IST
Telangana News Live: Mahabubabad : చేపల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం!
- Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీలో ఉన్నవారిని కాపాడాల్సిన స్థానికులు.. చేపల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికిన చేపలను వారు పట్టుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tue, 24 Sep 202407:26 AM IST
Telangana News Live: Hyderabad Rains : హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు
- Hyderabad Rains : హైదరాబాద్ నగరాన్ని వర్షం మళ్లీ వణికిస్తోంది. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
Tue, 24 Sep 202406:57 AM IST
Telangana News Live: TG Degree spot admissions : రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు.. పూర్తి వివరాలు ఇవే
- TG Degree spot admissions : డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు.. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రేపట్నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
Tue, 24 Sep 202406:18 AM IST
Telangana News Live: Peddapalli Survey: అక్రమ నిర్మాణాలు... నాలాల కబ్జా... అధికారుల సర్వేతో అక్రమార్కుల్లో టెన్షన్..
- Peddapalli Survey: పెద్దపల్లి జిల్లాలో చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల సర్వే స్పీడ్ అందుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి జెండాలతో మార్కింగ్ చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు.నెల రోజులుగా చెరువులు, నాలలపై అధికారులు దృష్టి సారించడంతో జిల్లాలోని చెరువు కబ్జాదారుల్లో టెన్షన్ నెలకొంది.
Tue, 24 Sep 202406:05 AM IST
Telangana News Live: Yadadri Ghee : ల్యాబ్‌కు యాదాద్రిలో వాడే నెయ్యి.. కారణం ఇదేనన్న టెంపుల్ ఈవో!
- Yadadri Ghee : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నెయ్యి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమలలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని ఆలయాల్లో వినియోగించే నెయ్యిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాదాద్రిలో వాడే నెయ్యిని ల్యాబ్‌కు పంపారు.
Tue, 24 Sep 202405:57 AM IST
Telangana News Live: Vigilance Enquiry: ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ, మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్
- Vigilance Enquiry: గత ప్రభుత్వం బిఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ సాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేర్, మల్కపేట కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ల రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. పలు ఫైళ్ళను సీజ్ చేసి హైదరాబాద్ కు తరలించారు.
Tue, 24 Sep 202405:30 AM IST
Telangana News Live: Rythu Runa Mafi : రుణమాఫీ కాలేదు.. వడ్డీలు కట్టిండి.. రైతులకు బ్యాంకుల హుకుం!
- Rythu Runa Mafi : పంద్రాగస్టు లోపే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డెడ్‌లైన్ దాటి నెల గడించింది. ఇప్పటికీ రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులపై బ్యాంకులు ఒత్తిడి పెంచుతున్నాయి. వడ్డీలు కట్టాలనీ నోటీసులు ఇస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు.
Tue, 24 Sep 202404:43 AM IST
Telangana News Live: JEE Main 2025 : జేఈఈ మెయిన్ నుంచి కీలక అప్‌డేట్.. దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యేది అప్పుడే!
- JEE Main 2025 : జేఈఈ మెయిన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. 10 రోజుల్లో జేఈఈ మెయిన్-2025 తేదీలను వెల్లడించనున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 20 వేల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది.
Tue, 24 Sep 202403:24 AM IST
Telangana News Live: Adulterated liquor: ఖరీదైన బాటిళ్లలో కల్తీ మద్యం, హైదరాబాద్‌లో బార్ బాయ్స్ అరాచకం, ధర తక్కువ అంటూ విక్రయాలు
- Adulterated liquor: హైదరాబాద్‌లో కొత్త రకం దందా వెలుగు చూసింది. బార్‌లలో ఖాళీ చేసే ఖరీదైన మద్యం సీసాలను సేకరించి వాటిలో చౌక రకం మద్యాన్ని నింపి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే విక్రయం పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు.
Tue, 24 Sep 202412:36 AM IST
Telangana News Live: Karimnagar Corporation: రోడ్డెక్కిన విలీన గ్రామాల ప్రజలు,కార్పొరేషన్ లో కలపొద్దు -గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ఆందోళన
- Karimnagar Corporation: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు గ్రామపంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆదిలోనే నిరసన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విలీన గ్రామాలను ప్రజలు కార్పొరేషన్ లో కలుపొద్దు... గ్రామపంచాయతీలే ముద్దు అంటూ రోడ్డెక్కారు.