Peddapalli Survey: అక్రమ నిర్మాణాలు... నాలాల కబ్జా... అధికారుల సర్వేతో అక్రమార్కుల్లో టెన్షన్..-illegal constructions tension among illegals with official survey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapalli Survey: అక్రమ నిర్మాణాలు... నాలాల కబ్జా... అధికారుల సర్వేతో అక్రమార్కుల్లో టెన్షన్..

Peddapalli Survey: అక్రమ నిర్మాణాలు... నాలాల కబ్జా... అధికారుల సర్వేతో అక్రమార్కుల్లో టెన్షన్..

HT Telugu Desk HT Telugu
Sep 24, 2024 11:48 AM IST

Peddapalli Survey: పెద్దపల్లి జిల్లాలో చెరువుల్లో ఫుల్‌ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల సర్వే స్పీడ్ అందుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి జెండాలతో మార్కింగ్ చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు.నెల రోజులుగా చెరువులు, నాలలపై అధికారులు దృష్టి సారించడంతో జిల్లాలోని చెరువు కబ్జాదారుల్లో టెన్షన్ నెలకొంది.

పెద్దపల్లిలో ఆక్రమణలపై అధికారుల సర్వే
పెద్దపల్లిలో ఆక్రమణలపై అధికారుల సర్వే

Peddapalli Survey: పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాల సర్వే కొనసాగుతోంది. నీటి కుంటలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు గుర్తిస్తున్నారు. దీంతొో అక్రమార్కుల్లో టెన్షన్ నెలకొంది. ఒకటికి రెండు సార్లు భూమి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేస్తున్నారు.

పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాల్లో నాలాల మీద నిర్మాణాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ సెంటర్లో ఓ బిల్డింగ్ కు దారి కోసం నాలాపైన రోడ్డు నిర్మించారు. దానిపై ఈ మధ్య కాలంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సాగర్ రోడ్, భూంనగర్, కునారం రోడ్, పాత కోర్టు ఏరియా, రంగంపల్లిలో ఉన్న నాలాల మీద నిర్మాణాలు జరిగాయని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

నాలాలు కబ్జా కావడంతో వర్షం పడినప్పుడల్లా పోలీస్ స్టేషన్ రోడ్డు పూర్తిగా మునుగుతోంది. అలాగే రాజీవ్ రహదారికి అనుబంధంగా ఉన్న కునారం రోడ్, ఆర్టీఏ ఆఫీసు రోడ్డుతోపాటు ఆ ప్రాంతమంతా మునుగుతోంది. ప్రధాన నాలాల మీద అక్రమ నిర్మాణాలతోనే ఈ ప్రాంతాలు ముంపు బారినపడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్కార్ ఆదేశాలతో కలెక్టర్ ఆక్రమణల గుర్తింపు చేపడుతూ, మార్కింగ్ చేయిస్తుండడంతో అక్రమార్కుల్లో టెన్షన్ నెలకొంది.

కూల్చివేతలకు శ్రీకారం చుట్టిన అధికారులు

పెద్దపల్లిలోని రెండు చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. జిల్లా వ్యాప్తంగా 970 చెరువులున్నట్లు రికార్డుల్లో ఉండగా దాదాపు 100కు పైగా పూర్తి స్థాయిలో కబ్జాకు గురైనట్లుగా తెలుస్తోంది. అలాగే చాలా చెరువులు పాక్షికంగా కబ్జాకు గురైనట్లు సమాచారం. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న చెరువులు కబ్జాకు గురవడంతోపాటు అందులో వెంచర్లు వెలిశాయి. అలాగే చాల చెరువుల ఎస్టీఎల్ బిల్డింగ్లు కూడా వెలిశాయి. దీంతో ఇరి గేషన్ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే జీపీల పరిధిలోని చెరువుల్లో కూడా బఫర్, ఎఫ్టీఎల్ గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డిజిటల్ సర్వేతో మార్కింగ్..

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఏర్పాటు చేసిన వెంచర్లు, షెడ్లను ఇప్పటికే కూల్చివేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిని గుర్తించి అధికారులు జెండాలు ఏర్పాటు చేసి మార్కింగ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని బంధంపల్లి, రం గంపల్లి చెరువుల్లో వెంచర్లు ఏర్పాటు చేసి ఇప్పటికే అమ్మగా.. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఆక్రమణలు పెద్దఎత్తున బయటపడుతాయని స్థానికులు అంటున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గుండం చెరువు బఫర్ లో కూడా నిర్మా ణాలు జరిగినట్లు మున్సిపల్ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

సంబంధిత కథనం