YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు, న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు
YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని, న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయితో పాటు అతడి తండ్రిపై యువతి ఫిర్యాదు చేసింది.
YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అడ్వొకేట్‌తో సహా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి...హర్షసాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు.
బాధిత యువతి హర్షసాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. యువతికి సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించినట్లు సమాచారం. బాధిత యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా అని తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు ప్రకటించారు.
పేద వారికి సాయం చేస్తూ ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయి...ఇటీవల హీరో అయ్యాడు. స్వీయ దర్శకత్వంలో 'మెగా' అని సినిమాలో హీరో చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హర్షసాయి నెటిజన్లకు సుపరిచితం. పేదవారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ హర్షసాయి వీడియోలు చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో హర్షసాయికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఇటీవల ఇతనిపై విమర్శలు కూడా వచ్చాయి. లక్షల్లో డబ్బు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురు విమర్శించారు.
మొదట యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్ష సాయి క్రియేటివ్ ఐడియాస్ తో రీల్స్, షార్ట్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారారు. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. మెగా పేరుతో ఓ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోగా హర్షసాయి నటిస్తున్నారు. ఇంతలో ఆ యువతి హర్షసాయి మోసగాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలోని వారిపై కేసులు పెరుగుతున్నాయి. హీరో రాజ్ తరుణ్, జానీ మాస్టర్ ఉదంతాలు ఇందుకు ఉదాహరణలు. తాజాగా హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది.
బెట్టింగ్ యాప్ ల వివాదం
ఇటీవల బెట్టింగ్ యాప్ ల ప్రమోట్ వివాదంలో చిక్కుకున్న హర్షసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని చెప్పుకొచ్చారు. దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో దేశంలోనే టాప్ యూట్యూబర్‌గా ఉన్న హర్షసాయి మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. తాను సంపాదించిన డబ్బుతో పేదలకు ఎంతో సాయం చేసేవాడు. అయితే ఈ డబ్బు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వల్ల వచ్చిందని హర్షసాయిపై ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ యాప్ ల వల్ల ఎంతో మంది అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అందుకు హర్షసాయి లాంటి వాళ్లు కారణమని అప్పట్లో నెటిజన్లు మండిపడ్డారు.
సంబంధిత కథనం