Harsha Sai MEGA Teaser: యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. ఆసక్తికరంగా! దర్శకత్వం కూడా అతడే..-youtuber harsha sai movie mega lo don title teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harsha Sai Mega Teaser: యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. ఆసక్తికరంగా! దర్శకత్వం కూడా అతడే..

Harsha Sai MEGA Teaser: యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. ఆసక్తికరంగా! దర్శకత్వం కూడా అతడే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2024 06:29 PM IST

MEGA - Lo Don title teaser: యూట్యూబర్ హర్షసాయి హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. డిఫరెంట్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ చిత్రంగా పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ రూపొందుతోంది.

MEGA Teaser: యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. ఆసక్తికరంగా!
MEGA Teaser: యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. ఆసక్తికరంగా!

MEGA - Lo Don title teaser: యూట్యూబర్‌గా హర్హసాయి చాలా పాపులర్. అతడి యూట్యూబ్ ఛానెల్‍కు 9 మిలియన్లకు పైగా సబ్‍స్క్రైబర్లు ఉన్నారు. అంత ఫేమస్ అయిన హర్షసాయి హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ రేంజ్‍లో రానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్ నేడు (సెప్టెంబర్ 17) లాంచ్ అయింది. విభిన్నమైన బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ సినిమాకు ‘మెగా’ అని పేరుపెట్టింది చిత్రయూనిట్. ‘లో డాన్’ అనే (MEGA - Lo Don) క్యాప్షన్ ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, దర్శకత్వం కూడా హర్షసాయి చేస్తున్నాడు. వివరాలివే..

ఓ భారీ గంటకు హీరో హర్షసాయిని కట్టేసి కొందరు శిక్ష విధించే సీన్‍తో ‘మెగా - లో డాన్’ మూవీ టైటిల్ టీజర్ మొదలైంది. ఓ డిఫరెంట్ బ్యాక్‍డ్రాప్‍లో ఉంది. హర్షసాయి వీపుపై ఉన్న టాటూను హైలైట్ చేస్తూ టీజర్ సాగింది. ఓ వింత మనిషి, ఓ సమూహం ఇలా టీజర్ గ్రాండ్‍గా ఉంది. ఆ సమయంలో కింద పడిన హర్షసాయి లేస్తాడు. “జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి.. నన్ను చూస్తే ఒప్పుకునే వాడిలా కనిపిస్తున్నానా” అంటూ హర్షసాయి డైలాగ్ ఉంది. ఆ తర్వాత హర్షకు ఓ ఆత్మ కనిపిస్తుంది. జంతువులు, సింహాలు, సముద్రం అంటూ డైలాగ్స్ ఉన్నాయి. 'మెగా - లో డాన్' అనేది అత్యంత భారీ జంతువు అని ఈ టీజర్‌లో ఉంది. “ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషి కథ” అంటూ ఈ టీజర్ ముగిసింది. మొత్తంగా 'మెగా' మూవీ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది.

ఈ 'మెగా - లో డాన్' మూవీ పాన్ ఇండియా రేంజ్‍లో రానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనన్నట్టు టీజర్లో పేర్కొంది.

శ్రీ పిక్చర్స్ పతాకంపై బిగ్‍బాస్ ఫేమ్ మిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కల్వకుంట్ల వంశీధర రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వికాస్ బాడిస ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Whats_app_banner