TG School Holidays : భారీ వర్షాల హెచ్చరికలు..! ఇవాళ కూడా ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు-today holiday for all schools in five districts due to the effect of rains in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg School Holidays : భారీ వర్షాల హెచ్చరికలు..! ఇవాళ కూడా ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు

TG School Holidays : భారీ వర్షాల హెచ్చరికలు..! ఇవాళ కూడా ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 03, 2024 01:06 AM IST

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సీఎస్ ఆదేశాలకు మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో భారీ వర్షాలు - బడులకు సెలవు ప్రకటన
తెలంగాణలో భారీ వర్షాలు - బడులకు సెలవు ప్రకటన

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల హెచ్చరికలతో ఇవాళ(మంగళవారం) కూడా పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సోమవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సెలవు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

ఇక తెలంగాణ మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ(సెప్టెంబర్ 03) ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీలో ఇవాళ వర్షాలు:

ఇవాళ(మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మరోవైపు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ,పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేపట్టారు సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 41927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

171 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో 36 NDRF,SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భాదితులకు సోమవారం 3లక్షల ఆహార ప్యాకెట్లు, త్రాగునీరు ·ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగించారు. 188 బోట్లును,283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.

సంబంధిత కథనం