CM Chandrababu : బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, బోటులో ప్రయాణించి బాధితులకు భరోసా-vijayawada cm chandrababu visited singh nagar budameru flood affected areas ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cm Chandrababu : బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, బోటులో ప్రయాణించి బాధితులకు భరోసా

CM Chandrababu : బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, బోటులో ప్రయాణించి బాధితులకు భరోసా

Sep 01, 2024, 08:52 PM IST Bandaru Satyaprasad
Sep 01, 2024, 08:52 PM , IST

  • CM Chandrababu : విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు సీఎం చంద్రబాబు పరిశీలించారు. 

విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు.  బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు.  బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు సీఎం చంద్రబాబు పరిశీలించారు. 

(1 / 8)

సింగ్ నగర్ లో బుడమేరు గండి పూడ్చే విషయాన్ని సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  

(2 / 8)

విజయవాడ సింగ్ నగర్ లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

(3 / 8)

విజయవాడలో బుడమేరు వాగు పొంగి పొర్లడంతో జలదిగ్బంధంలో ఉన్న సింగ్ నగర్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పి.నారాయణ, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. సహాయక చర్యలని పర్యవేక్షించారు.

(4 / 8)

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు... బుడమేరు మునక ప్రాంతంలో సహాయక చర్యలపై సమీక్షించారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని సీఎం స్పష్టం చేశారు. పాలు, అహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలన్నారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. 

(5 / 8)

ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, టాక్టర్లు తక్షణం తెప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ బాధితులకు అందించాలన్నారు.  

(6 / 8)

వృద్దులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో ఉన్న అన్ని షాపుల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు.  బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దామన్నారు.  

(7 / 8)

సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అక్షయ పాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని, ఖర్చు గురించి ఆలోచన చెయ్యకండని అధికారులకు స్పష్టం చేశారు.  

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు