Heavy Rain in Khammam | ఖమ్మంలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందుల్లో జనం
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జన జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. ఖమ్మం జిల్లాలో వర్షాలకు వరద పోటెత్తుతోంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు పరివాహకంలోని 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలనీలు నీటమునగడంతో బాధితులు ఇళ్ల పైకి చేరుకున్నారు. ఇప్పటికీ నీరు అలాగే నిలిపోవటంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు అమ్మ, అయ్యా అంటారే తప్ప, ఇలాంటి సమయంలో పట్టించుకునే వారే లేరన్నారు.