Srisailam and NagarjunaSagar Projects: కర్ణాటకతో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అల్మట్టి, నారాయాణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద చేరగా…. తెలంగాణ, ఏపీ ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు క్రమంగా వచ్చి చేరుతోంది.
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7,898వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు, కాగా ప్రస్తుతం 806.80 అడుగులుగా ఉంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 505.00 అడుగులుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.47 టీఎంసీలుగా నమోదైంది. ఇక నాగర్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 123.34 టీఎంసీలుగా ఉంది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి దిగువనకు 4,997 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుతం 317 మీటర్లుగా ఉంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో జూరాల అ