నాగార్జున సాగర్‌కు నెలరోజుల ముందుగానే వరద కొనసాగుతోంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 534.40 అడుగుల నీటిమట్టం ఉంది. నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.