తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: రష్మిక మందన్న చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్.. బంగారంలా మెరిసిపోతున్న నేషనల్ క్రష్
Rashmika Mandanna Upcoming Movies: రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతోంది. ఒకదాని తర్వాత మరొకటితో వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న క్రేజీ సినిమాలతోపాటు తాజాగా ఆమె వెసుకున్న డ్రెస్‌పై లుక్కేస్తే..
(1 / 7)
రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్స్ లో ఒకరు. రష్మిక మందన్న ఒకదాని తర్వాత ఒకటి వరుస సినిమాల్లో నటిస్తోంది. ఆమె చేతిలో ఉన్న అన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం.
(2 / 7)
శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున కూడా నటిస్తున్నారు.
(3 / 7)
అలాగే బాలీవుడ్ లో కూడా రష్మిక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన 'చావా' సినిమాలో నటిస్తోంది.
(4 / 7)
రష్మిక రెయిన్ బో అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. శాంతరుబన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక సరసన దేవ్ మోహన్ హీరోగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే యెల్లో కలర్ డ్రెస్సులో రష్మిక మందన్నా మెరిసిపోతున్న లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(5 / 7)
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాను కూడా ఇంతకుముందే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
(6 / 7)
అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇతర గ్యాలరీలు