Krishna River Basin : భారీగా వరద, అల్మట్టి గేట్లు ఎత్తివేత - జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు...!
- Krishna River Basin Floods :కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చేరే అవకాశం ఉంది.
- Krishna River Basin Floods :కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చేరే అవకాశం ఉంది.
(1 / 6)
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలో అతి ముఖ్యమైన అల్మట్టి డ్యామ్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
(2 / 6)
అల్మట్టి డ్యామ్ నుంచి మొత్తం 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది.
(3 / 6)
అల్మట్టి డ్యామ్ లో ఇప్పటివరకు 98.729 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సాయంత్రానికి 100 టీఎంసీలు లోపలికి చేరే అవకాశం ఉంది.
(4 / 6)
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం కొనసాగితే ఈ నెల చివరి వారం నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
(5 / 6)
నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని జూరాలకు కృష్మమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది.
(6 / 6)
జూరాల వరకు వరద నీరు చేరితే ఆ తర్వాత శ్రీశైలం వైపు పరుగులు పెట్టనుంది. గత కొంతకాలంగా కృష్ణా బేసిన్ లో నీటి నిల్వలు ఆశించిన మేర లేవు. గత కొద్దిరోజులుగా ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో….. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం మొదలైంది. ఈ నెలాఖారులోగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకునే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు