Metro Tickets In WhatsApp : వాట్సాప్‌లో మెట్రో టికెట్ ఎలా బుక్ చేయాలంటే?
Hyderabad Metro WhatsApp eTicketing : మెట్రో ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేయోచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు వాట్సాప్ లోనూ టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించారు.
ఇక మీరు మెట్రో టికెట్ల(Metro Tickets) కోసం క్యూలో నిలుచోవాల్సిన పని లేదు. నేరుగా వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేయోచ్చు. పేటీఎం, ఫోన్ పే లాంటి యాప్స్ లో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో మరో ముందడుగు వేసింది. ప్రయాణికులు వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఇచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చింది. ఈ మేరకు బిల్ ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సర్వీస్.. రెగ్యులర్ హైదరాబాద్ ప్రయాణికులకు సజావుగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణికులు ఇప్పుడు వారి వాట్సాప్ నంబర్‌లో ఇ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద చూపించాలి. వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు.. ముందుగా 83411 46468 నంబరుకు వాట్సాప్‌లో( Book Tickets On WhatsApp) హాయ్ చెప్పాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత.. మనం వెళ్లాల్సిన చోటును ఎంటర్ చేయాలి. టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత.. వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ-టికెట్ వస్తుంది. మెట్రో స్టేషన్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి సైతం.. టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
'హైదరాబాద్ మెట్రో రైలు డిజిటలైజేషన్ ను నమ్ముతుంది. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా మా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్వాం. పూర్తి డిజిటల్ చెల్లింపులతో భారతదేశంలో మొట్టమొదటి మెట్రో WhatsApp eTicketing సౌకర్యాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇది కూడా సక్సెస్ అవుతుందనుకుంటున్నాం.' అని L అండ్ TMRHL, MD అండ్ CEO, KVB రెడ్డి చెప్పారు.