5G Services : దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభం
దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభం అయ్యాయి. 5జీ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలు ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‍లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలోనే 5జీ సేవలకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
5G Services దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని 5జీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటూలోకి రానున్నాయి.
దేశంలోని 13నగరాల్లో 5జీ 5G Services సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంఛనంగా 5జీ సేవల్ని ప్రారంభించారు. ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు.
దేశ రాజధానితో ఢిల్లీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, అహ్మదాబాద్ గాంధీనగర్, లక్నో, పూణే, జాంనగర్ తదితర నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, ఒడాఫోన్‌ఐడియాలు 5జీ సేవల్ని దేశవ్యాప్తంగా మొదటి దశలో ప్రధాన నగరాల్లో 5జీ సేవల్ని అందించనున్నాయి.
దేశంలోని మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలు లక్షా 53వేల కోట్ల రుపాయల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.4జీతో పోలిస్తే పది రెట్లు వేగంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో అన్ని ప్రాంతాలకు 5జీ సేవల్ని విస్తరించనున్నారు. 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మెరుగైన టెలికాం సేవల్ని అందుకోవచ్చు. మెరుపు వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ సాధ్యమవుతోంది.
ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5జీ విశిష్టతలను టెలికాం కంపెనీల ప్రతినిధులు ప్రధాని మోదీకి వివరించారు.డ్రోన్ ఆధారిత వ్యవాసయం, హై సెక్యూరిటీ రూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ థ్రెట్ డిటెన్షన్ ప్రోగ్రామ్స్, ఆటోమెటేడ్ గైడెడ్ వెహికల్స్, స్మార్ట్ అంబులెన్స్, అగుమెటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, సీవేజ్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్ అగ్రి ప్రోగ్రాం, హెల్త్ డయాగ్నోస్టిక్స్ వంటి ఉపయోగాలున్నాయి. 5జీ టెక్నాలజీ ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉంటాయని, సామాన్య ప్రజానీకానికి కూడా అనేక రకాలుగా కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
సిగ్నల్ ప్రొబ్లెమ్స్ వంటివి తగ్గడం, హై డేటా రేట్ వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.5జీ టెక్నాలజీతో ఇంధన సామర్ధ్యం, స్పెక్ట్రమ్ సమర్ధవంతమైన వినియోగం సాధ్యపడుతుందని చెబుతున్నారు.5జీ సేవల్ని ప్రారంభించే సమయంలో పలు స్టాళ్లను ప్రధాని సందర్శించారు. జియో ట్రూ 5జీ స్టాల్లో జియో గ్లాస్ ద్వారా వర్చువల్ కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ భారతీ మిట్టల్, ఒడాఫోన్ ఐడియాకు చెందిన కుమార్ మంగళం బిర్లాలు ప్రధానితో ముచ్చటించారు. 5జీ టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.