T Assembly KCR : మిగిలిన డబ్బులు ఏపీ నుంచి ఇప్పించాలని కోరిన కేసీఆర్‌-telanaga cm kcr fires on bjp lead govt electricty reforms and new acts implementation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Assembly Kcr : మిగిలిన డబ్బులు ఏపీ నుంచి ఇప్పించాలని కోరిన కేసీఆర్‌

T Assembly KCR : మిగిలిన డబ్బులు ఏపీ నుంచి ఇప్పించాలని కోరిన కేసీఆర్‌

B.S.Chandra HT Telugu
Sep 12, 2022 12:36 PM IST

T Assembly KCR తెలంగాణ ఏర్పాటైనపుడు తెలంగాణ రాష్ట్రంలో తలసారి వినియోగం 970 యూనిట్లు, జాతీయ స్థాయి విద్యుత్‌ వినియోగం 957 యూనిట్లుగా ఉందని, కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఒకేసారి అధికారంలోకి వచ్చాయని ప్రస్తుతం తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2126యూనిట్లుగా ఉందని, విద్యుత్‌ వినియోగంలో ఎవరు వృద్ధి సాధించారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేంద్రంపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 17వేల కోట్లలో విద్యుత్ రంగ బకాయిలు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బీజేపీ నేతలు ఇప్పించాలని కేసీఆర్ కోరారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (HT)

T Assembly KCR విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కేటాయింపు కోసం కొట్లాడటం వల్ల 53శాతం విద్యుత్‌ను తెలంగాణకు కేటాయించారని, తెలంగాణ విద్యుత్‌ అవసరం, బోర్ల మీద ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించి సోనియా, మన్మోహన్‌ సింగ్‌లు విభజన చట్టంలో నిబంధనలు చేర్చారని కేసీఆర్ గుర్తు చేశారు.

ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ మొదటి సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు ఆంధ్రాలో కలిపేశారని T Assembly KCR ఆరోపించారు. మోదీ అత్యంత ఫాసిస్టు ప్రధానమంత్రి అని అదే సమయంలో విమర్శించానని కేసీఆర్‌ గుర్తు చేశారు. 460 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును బలవంతంగా ఏపీలో విలీనం చేశారని కేసీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉండి రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంపై అభ్యంతరాలు వచ్చినా తాను ఖాతరు చేయలేదని, ముంపు మండలాల విలీనం పేరుతో కర్కశంగా వ్యవహరించారని ఆరోపించారు.

విద్యుత్‌ రంగ సంస్కరణల పేరుతో మీటర్ల పెడుతున్నారని, దీని పర్యావసానాలు ఇప్పుడే తెలియవని, భవిష్యత్తులో సామాన్య ప్రజలు విద్యుత్‌ను భరించలేని పరిస్థితి వస్తుందని T Assembly KCR హెచ్చరించారు.

తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ….

T Assembly KCR తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

దీంతోపాటు మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్‌రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తిరస్కరించారు.

సామాన్యులకే కష్టాలేనన్న భట్టి విక్రమార్క….

ఎన్నో కష్టాలు, త్యాగాలతో నిర్మితమైన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ అమ్మేస్తోందని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ ప్రజల భవిష్యత్తును ఒకరిద్దరు పెట్టుబడి దారుల చేతుల్లో పెడుతుంటే చూస్తూ ఊరుకోకూడదన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో బిల్లును స్వాగతించారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించారని, వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగడం వల్ల కొంత మేర రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు.

పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీల్లో పావు వంతు కూడా ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని చెప్పడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంటే తప్ప రాష్ట్రాలను సమదృష్టితో చూడకూడదని భావించడాన్ని తప్పు పట్టారు. ప్రధాని నుంచి ప్రతి మంత్రి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రావాలని చెప్పడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోతే రాష్ట్రానికి లబ్ది చేకూర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్శిటీలు, ప్రాజెక్టులు రావాల్సి ఉన్నా ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కూడా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క రుపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం రూ.6576కోట్ల రుపాయలు ఏపీకి బిల్లు కట్టాలని ఎలా చెబుతుందన్నారు. .

దోచి పెట్టడానికే కొత్త చట్టాలు…

ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా రాష్ట్రంలో కరెంటు కష్టాలు మాత్రం తప్పడం లేదని సిఎం కేసీఆర్ T Assembly KCR చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది బాధ్యత అనే సంగతి గుర్తుంచుకోవాలని, కేంద్రం చట్టాలు చేసేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి చేయాల్సిన చట్టాల జాబితాలో విద్యుత్‌ కూడా ఉందన్నారు. రాష్ట్రాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా కరెంటు చట్టాలను చేయడాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్ష సభ్యుడు పార్లమెంటులో ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల T Assembly KCRపేరుతో పేదలు, రైతులు, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునే విధానాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. కేంద్ర చట్టం అన్యాయమైన చట్టమని, దాని వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించాలని కేంద్రం లేఖలపై లేఖలు రాస్తుందని, అలా అమ్మే వారికి బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసిని అమ్మేయాలని తరచూ లేఖలు రాస్తున్నారని ఆరోపించారు.

మరుగుజ్జు రాజకీయాలను తిప్పి కొట్టాలి….

T Assembly KCR కరెంటు చట్టం వెనుక ఉన్న కుట్రను ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో జాతీయ జెండా ఎగురవేయొద్దనే దరిద్రులు ఓ పార్టీలో ఉన్నారని, మహాత్ముడు పుట్టిన దేశంలో కొందరు మరుగుజ్జులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఏ పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నాడని, కేంద్ర హోం మంత్రి నుంచి అప్రజాస్వామిక మాటల్ని దేశం ఎందుకు భరించాలన్నారు.

T Assembly KCR రెండు సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిన పార్టీకి ఒక్కసారి కూడా 50శాతం ఓట్లు రాలేదన్నారు. 36శాతం ఓట్లతో దేశాన్ని పాలిస్తుందని, అధికారం తలకెక్కి గర్వంతో మాట్లాడితే దేవుడు కూడా వారిని కాపాడలేరన్నారు. దేశంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయని, భారతమాత గుండెకు గాయం చేస్తున్నారని మండిపడ్డారు. లోక్‌ నాయక్‌ జేపీ జైలు నుంచి పిలుపునిస్తే దేశంలో జనతా పార్టీ జెండా ఎగురవేసిందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని ఇంకో 18 నెలలు బీజేపీ పీడ విరగడవుతుందన్నారు.

T Assembly KCR 75ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1255 యూనిట్లుగా ఉందని అమెరికాలో 12,154యూనిట్లు, జపాన్‌ 5150 యూనిట్లు, చైనా 6312, భూటాన్లో 3100 యూనిట్ల తలసరి వినియోగం ఉందని కేసీఆర్ చెప్పారు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 140దేశాల్లో సర్వే చేస్తే భారత దేశం 104వ స్థానంలో ఉందని, విశ‌్వగురు పాలనలో దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో దాదాపు కోటి కుటుంబాలకు ప్రిపెయిడ్ మీటర్ల ఏర్పాటు వల్ల కష్టం కలుగుతుందని హెచ్చరించారు. దళితులు, నాయిబ్రహ్మణులు, రజకులు, చిన్నాచితక వ్యాపారులకు కేంద్రం చెప్పిన నిబంధనలు అమలు చేస్తే తక్షణం మీటర్లు పెట్టాల్సి వస్తుందన్నారు.

దేశంలో 20లక్షల మంది ఉద్యోగులు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నారని వారందరి ఉద్యోగాలు పోతాయని T Assembly KCR కేసీఆర్ హెచ్చరించారు. వ్యవసాయం, విద్యుత్‌ రంగాలను షావుకార్లకు అప్పటించే వరకు నిద్రపోనని కేంద్రం చెబుతోందన్నారు. బాన్సువాడ రైతులు పంజాబ్‌లో అమ్ముకునే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. దుబ్బాక రైతులు సిద్ధిపేటలో అమ్మే పరిస్థితులే లేనప్పుడు ఎక్కడైనా అమ్ముకోవడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. విద్యుత్‌ బకాయిలపై ఏపీకి రూ.6వేల కోట్ల రుపాయలు చెల్లించాలని ఆదేశించిన కేంద్రం, ఏపీ నుంచి తెలంగాణకు రూ.17వేల కోట్ల రుపాయలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.6వేల కోట్లను మినహాయించుకుని మిగిలిన డబ్బును బీజేపీ తెలంగాణకు ఇప్పించాలని కోరారు.

గ్రామీణ విద్యుత్‌ సంస్థ వద్ద ఉన్న 14లక్షల కోట్ల ఆస్తుల్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ తెరపైకి తెచ్చారని T Assembly KCR కేసీఆర్‌ ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో సాధించిన పురోగతిని కొంతమందికి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను 25రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ 2024