Barmer girl rape: రేప్ కేసులో నిందితుడు.. హైదరాబాద్‌లో పోలీసుల అదుపులోకి
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడుని రాజస్తాన్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
బార్మర్ (రాజస్థాన్): రాజస్థాన్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై సోమవారం హైదరాబాద్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 24న ఆవు పేడ సేకరించేందుకు వెళ్లిన 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా మదన్ సింగ్ అనే నిందితుడిని సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
అంతకుముందు సెప్టెంబర్ 26న బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఆవు పేడ తీసుకునేందుకు బయటకు వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాఠశాల ముగిసిన తర్వాత నిందితుడు మదన్ సింగ్ పాఠశాల సమీపంలోనే ఉన్నాడు. స్కూల్ బాత్ రూం దగ్గర నుంచి ఆవు పేడను తీసుకెళ్లాలని సూచించాడు. బాధితురాలు అతడిని నమ్మి లోపలికి వెళ్లగానే నిందితుడు ఆమెను పట్టుకుని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విని కొందరు మహిళలు అక్కడికి చేరుకోగా, నిందితుడు అప్పటికే పారిపోయారు.
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత బాధితురాలికి వైద్య చికిత్స అందించారు. డీఎస్పీ శుభకరన్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలు సైబర్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు గుడమలాని చీఫ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ ధాకా తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ హర్షరామ్, కానిస్టేబుల్ శ్యామ్‌దన్ చరణ్, ఆశురాం బైష్ణోయ్‌లతో కూడిన బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు. నిందితుడిని హైదరాబాద్ నుంచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.